రాహుల్ ప్రధాని అవుతారు - స్వామిజీ జోస్యం : పీఎం మోదీకి కష్టమేనా...!!
ప్రధాని మోదీకి..బీజేపీకి తిరుగులేదని భావిస్తున్న వేళ..ఒక స్వామిజీ చెప్పిన జోస్యం బయటకు వచ్చింది. ఇది కాంగ్రెస్ తో పాటుగా బీజేపీ వ్యతిరేకులకు జోష్ పెంచుతోంది. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని అవుతారంటూ జోస్యం చెప్పారు. కర్ణాటక చిత్రదుర్గలోని శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యాపీఠ్ను రాహుల్ గాంధీ సందర్శించారు. ఈ సమయంలోనే రాహుల్ గురించి అక్కడ ఉన్న హవేరీ హోసముట్ స్వామీజి భవిష్య వాణి చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధానిగా
నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారని.. ఇప్పుడు రాహుల్ కూడా అవుతారని ..ఇది ఖాయమని చెప్పుకొచ్చారు. అంతలోనే జోక్యం చేసుకున్న మురుగ మఠాధిపతి శ్రీ శివమూర్తి మురుగ శరణరు..పీఠంలో రాజకీయ వ్యాఖ్యలు చేయవద్దంటూ వారించారు. మఠాధిపతి డా. శ్రీ శివమూర్తి మురుగ రాజేంద్ర శరణరు నుంచి రాహుల్ గాంధీ ఇష్టలింగ దీక్ష స్వీకరించారు. సాధారణంగా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు.. ఈ ఆచారాన్ని పాటిస్తారు. స్వామి బసవన్న బోధనలు ఎప్పటికీ నిలిచి పోతాయని, వాటి గురించి తాను తెలుసుకోవడం సంతోషంగా ఉందని రాహుల్ చెప్పుకొచ్చారు.

వైరల్ అవతున్న స్వామీజీ జోస్యం
కర్ణాటక పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ హుబ్బళ్లిలో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి హాజరయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధత గురించి రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ లో పరిస్థితులు తమకు అనుకూలిస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అయితే, అక్కడ పార్టీలో కీలక నేతలుగా..సీఎం అభ్యర్ధులుగా ప్రచారం లో ఉన్న డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య విభేధాలు ఉన్నాయని ప్రచారంలో ఉంది. అయితే, రాహుల్ గాంధీ సమక్షంలో ఈ ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకున్నారు.

దీక్షలో రాహుల్.. కర్ణాటక పై ఫోకస్
దీని పైన రాహుల్ సంతోషం వ్యక్తం చేసారు. అయితే, రాహుల్ గాంధీ గత కొంత కాలంగా ప్రముఖ దేవాలయాలు..మఠాలు సందర్శిస్తున్నారు. ప్రధాని మోదీ..బీజేపీ నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు. త్వరలో గుజరాత్ ..హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ లో ఈ ఎన్నికలు జరుగాల్సి ఉంది. అయితే, 2024 ఎన్నికల సమయానికి ప్రధాని మోదీకి వ్యతిరేక పార్టీలు ఒక్కటయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో రాహుల్ ప్రధాని అవుతారంటూ చిత్రదుర్గలోని శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యాపీఠ్ స్వామీజీ జోస్యం చెప్పిన అంశం..ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications