Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫామ్ హౌస్ లో ప్రియుడితో భార్య ?, భార్యను చంపిన భర్తకు శిక్ష తగ్గించిన హైకోర్టు !

బెంగళూరు/దొడ్డబళ్లాపురం: తోటలో ప్రియుడితో జల్సా చేస్తున్న భార్యను హత్య చేసిన భర్త అరెస్టు అయ్యాడు. భార్యను హత్య చేసిన భర్తకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. తన భార్యను తాను కావాలని చంపలేదని, అది అనుకోకుండా జరిగిన సంఘటన అని భర్త హైకోర్టును ఆశ్రయించాడు. పూర్తి సమాచారం తెలుసుకున్న హైకోర్టు భర్తకు యావజ్జీవ శిక్షను తగ్గించి 7 ఏళ్లు కారాగార శిక్ష విధించింది.

బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దొడ్డబళ్లాపురం తాలుకాలోని బోమ్మనహళ్లిలో నివాసం ఉంటున్న రాజేష్ అనే వ్యక్తికి తపసీహళ్ళిలో నివాసం ఉంటున్న లక్ష్మీ అనే యువతికి 2010 అక్టోబర్ 22వ తేదీన వివాహం జరిగింది. 2011లో లక్ష్మీ పంచాయితీలు పెట్టింది. తన భర్త రాజేష్ తో తాను కలిసి కాపురం చెయ్యలేనని, అతను రెండో పెళ్లి చేసుకున్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని లక్ష్మీ చెప్పింది.

illicit relationship

పెద్దలు పంచాయితీలు చేసిన సమయంలో కూడా లక్ష్మీ ఇదే మాట చెప్పింది. తరువాత భర్త రాజేష్ రెండో పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదని పెద్దల సమక్షంలో లక్ష్మీ లిఖితపూర్వకంగా అంగీకరిస్తూ లేఖ రాసింది. తరువాత జరిగిన కుటుంబ గొడవల కారణంగా 2015లో లక్ష్మీ ఆమె భర్త రాజేష్ తో పాటు అతని కుటుంబ సభ్యుల మీద క్రిమినల్ కేసులు పెట్టింది.

కోర్టులో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రతినెల లక్ష్మీకి రూ. 2 వేలు ఇవ్వాలని కోర్టు రాజేష్ కు ఆదేశాలు జారీ చేసింది. తరువాత కూడా లక్ష్మీ, రాజేష్ అప్పుడప్పుడు కలుస్తూ కాపురం చేశారని వెలుగు చూసింది. కొంతకాలం తరువాత వేకువ జామున 4 గంటల సమయంలో లక్ష్మీ ఆమె ప్రియుడితో కలిసి రాజేష్ కు చెందిన తోటలో (ఫామ్ హౌస్ లో) ఎంజాయ్ చేస్తోంది.

illicit relationship

సమాచారం తెలుసుకున్న రాజేష్ తోట దగ్గరకు వెళ్లాడు. ఆ సందర్బంలో భార్య లక్ష్మీ నగ్నంగా పరాయి వ్యక్తితో రసపట్టులో ఉన్న విషయం గుర్తించిన రాజేష్ రగిలిపోయాడు. లక్ష్మీతో ఎంజాయ్ చేస్తున్న ప్రియుడు నగ్నంగా అక్కడి నుంచి పరుగుతీశాడు. అదే సమయంలో లక్ష్మీ వేసుకున్న పంజాబి డ్రెస్ వేల్ తో ఆమె గొంతు నులిమి చంపేశాడు.

లక్ష్మీని హత్య చేసి ఆమె శవాన్ని అదే తోటలో పూడ్చేసిన రాజేష్ ఇంటికి వెళ్లిపోయాడు. తరువాత పోలీసుల భయంతో రాజేష్ జరిగిన విషయాన్ని అతని స్నేహితుడు లక్ష్మణ్ కు చెప్పాడు. లక్ష్మణ్ సలహామేరకు రాజేష్ దొడ్డబళ్లాపురం పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో లక్ష్మీ శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.

ఇదే కేసులో రాజేష్ కు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. తాను కావాలని తన భార్య లక్ష్మీని హత్య చెయ్యలేదని, తనకు శిక్ష తగ్గించాలని రాజేష్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. కర్ణాటక హైకోర్టులోని ద్విసభ్య బెంచ్ లోని న్యాయమూర్తులు జస్టిస్ బి. వీరప్ప, జస్టిస్ కేఎస్ హేమలేఖ రాజేష్ కేసు విచారణ చేశారు.

ఈ సందర్బంలో నిందితుడు రాజేష్ తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు. రాజేష్ తోట దగ్గరకు వెళ్లిన సమయంలో అతని భార్య లక్ష్మీ అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని, ఆ సమయంలో రాజేష్ దగ్గర ఎలాంటి మారణాయుధాలు లేవని, అసలు లక్ష్మీని హత్య చెయ్యాలని రాజేష్ కు ఎలాంటి ఉద్దేశం లేదని హైకోర్టుకు చెప్పారు.

illicit relationship

భార్యను చూడరాని సన్నివేశంలో చూసిన రాజేష్ సహనం కోల్పోయి ఆమె మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని, తరువాత సహనం కోల్పోయి అనుకోకుండా ఆమెను చంపేశాడని, ఉద్దేశపూర్వకంగా హత్య చెయ్యలేదని లాయర్ హైకోర్టుకు చెప్పారు. వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు రాజేష్ కు కిందికోర్టు విదించిన యావజ్జీవ శిక్షను రద్దు చేస్తూ అతనికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. లక్ష్మీ పిల్లల పేరుతో రూ. 3 లక్షలు డిపాజిట్ చెయ్యాలని కర్ణాటక హైకోర్టు రాజేష్ కు ఆదేశాలు జారీ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+