వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరోగ్యశాఖ మంత్రికి సోకిన కరోనా: ‘కలిసిన వారందరూ క్వారంటైన్లో ఉండాలి’

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ పెద్దలను కూడా కరోనా వదలడం లేదు. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మాజీ సీఎం సిద్ధరామయ్యలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా, కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములుకు కూడా కరోనా సోకింది.

తనకు కరోనా సోకినట్లు స్వయంగా మంత్రి శ్రీరాములు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనలో స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి ప్రారంభమైన నాటి నుంచి జిల్లాల్లో పర్యటింంచారు. కరోనా రోగులకు అందుతున్న చికిత్సలు, సౌకర్యాలను ఆయన పర్యవేక్షించారు.

Karnataka Health Min B Sriramulu tests positive for coronavirus

ఈ క్రమంలోనే తనకు కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరినట్లు మంత్రి శ్రీరాములు తెలిపారు. తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని, హోంక్వారంటైన్లో ఉండాలని కోరారు. కాగా, ఇప్పటికే సీఎం యడ్యూరప్ప, మాజీ సీఎం సిద్ధరామయ్యలు బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

కాగా, కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు నానాటికీ పెరుగిపోతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,64,924 కరోనా కేసులు నమోదయ్యాయి. 77,685 యాక్టివ్ కేసులున్నాయి. 84,232 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,998 మంది కరోనా బారినపడి మరణించారు.

English summary
Karnataka's Health Minister B Sriramulu has tested positive for the novel coronavirus. He has been hospitalised and is being treated for Covid-19. The minister has also asked all of those who came in contact with him recently to take necessary precautions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X