రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం, 300 కేజీల బంగారు బిస్కెట్ల వివరాలు ఇవ్వండి, హై కోర్టు !
బెంగళూరు: కర్ణాటకతో పాటు అనేక రాష్ట్రాల్లో సంచలనం రేపిన రూ. వేల కోట్ల ఐఎంఏ జ్యూవెలర్స్ స్కాం కేసులో స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్ల వివరాలు ఇవ్వాలని కర్ణాటక హై కోర్టు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (ఎస్ఐటీ) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 300 కేజీల బంగారు బిస్కెట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారని కోర్టు దృష్టికి రావడంతో ఆ వివరాలు అడిగారు.

హై కోర్టు ఆదేశం
ఐఎంఏ స్కాం కేసుకు సంబంధించి కర్ణాటక హై కోర్టులో విచారణ జరిగింది. అర్జీ విచారణ చేసిన హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎ.ఎస్. ఓకా, న్యాయమూర్తి పీ.ఎం. నవాజ్ నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ ఐఎంఏ కేసులో మీరు స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్ల వివరాలు ఇవ్వాలని ఎస్ఐటీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

303 కేజీల బంగారు బిస్కెట్లు
దర్యాప్తు చేస్తున్న ఎస్ఐటీ అధికారులు 303 కేజీల బరువున్న 5008 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఈ వివరాలను అర్జీదారులు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఐఎంఏ జ్యూవెలర్స్ యజమాని మన్సూర్ ఆలీ ఖాన్ ను విచారణ చేసిన ఎస్ఐటీ అధికారులు అతని దగ్గర 303 కేజీల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.

ఐఎంఏ జ్యూవెలర్స్
అర్జీదారు తరపున వాదనలు వినిపించిన న్యాయవాది మీడియాలో వచ్చిన వార్తలకు ఎస్ఐటీ అధికారులు సమాధానం చెప్పాలని, ఐఎంఏ జ్యూవెలర్స్ కేసులో స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్ల వివరాలు కోర్టుకు ఇవ్వాలని మనవి చేశారు.

సీబీఐకి ఐఎంఏ స్కాం కేసు !
స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్ల వివరాలు ఇవ్వాలని ఎస్ఐటీ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన హై కోర్టు కేసు విచారణ సెప్టెంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. ఐఎంఏ స్కాం కేసును సీబీఐకి అప్పగిస్తామని కర్ణాటక ప్రభుత్వం చెప్పింది. ఐఎంఏ కేసు సీబీఐ విచారణ ప్రారంభించిదా అని హైకోర్టు ప్రశ్నించింది. సీబీఐ దర్యాప్తు ఇంకా మొదలు కాలేదని న్యాయవాది హై కోర్టుకు చెప్పారు.
-
Gold: భారీగా పెరిగిన బంగారం ధరలు. పసిడి మార్కెట్లో పూనకాలు -
"మేము VIPs.. ప్రతి ఎమ్మెల్యేకు 5 ఐపీఎల్ టికెట్స్.. సెపరేట్ సీటింగ్" -
శివరాత్రి రోజు మటన్ తిన్నా.. శుభ ముహూర్తాలను నమ్మను: సీఎం సంచలనం -
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
ఉద్యోగుల బకాయిల విడుదలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, డెడ్ లైన్..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications