జయకు క్లీన్ చిట్ ఇచ్చిన జడ్డీ పదవీ విరమణ
బెంగళూరు: అక్రమ ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జే. జయలలితకు క్లీన్ చిట్ ఇచ్చిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి సి.ఆర్. కుమారస్వామి ఆగస్టు 24వ తేది సోమవారం పదవీ విరమణ చేయనున్నారు.
న్యాయమూర్తి సి.ఆర్. కుమారస్వామి పూర్తి పేరు చిక్కరాచయ్య కుమారస్వామి. ఈయన 1983వ సంవత్సరంలో న్యాయవాది వృత్తిలో అడుగు పెట్టారు. 1993 నుండి 2005 వరకు మైసూరు, బళ్లారి, కోలారు, చిక్కమగళూరు, హాసన్ జిల్లాలలో న్యాయమూర్తిగా పని చేశారు.
తరువాత కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్ లకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. జయలలితకు రూ. 100 జరిమానా విధించారు.

మిగిలిన ముగ్గురికి రూ. 10 కోట్ల చోప్పున జరిమాన విధించారు. తరువాత జయలలిత తదితరులను పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. జయలలిత తదితరులు కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. కేసు విచారణ సి.ఆర్ కుమారస్వామి దగ్గరకు వెళ్లింది.
కేసు వివరాలు తెలుసుకున్న న్యాయమూర్తి సి.ఆర్. కుమారస్వామి సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తు ఆదేశాలు జారీ చేశారు. జయలలితకు విధించిన జైలు శిక్షతో పాటు జరిమానాను రద్దు చేస్తు తీర్పు చెప్పారు. తరువాత జయలలిత తదితరులు జైలు నుండి విడుదల అయ్యారు. ప్రస్తుతం ఇదే కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉంది.












Click it and Unblock the Notifications