ఆసియాలోనే నెంబర్ వన్ ఆర్ టీసీ ఏదంటే ?, లక్షల మందికి జీవనోపాది !

బెంగళూరు/బళ్లారి: కర్ణాటక గర్వించదగిన సంస్థల్లో కేఎస్ఆర్ టీసీ సంస్థ కూడాఒకటి. కేఎస్ఆర్ టీసీ చాలా ఖ్యాతిని సంపాధించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక బస్సులు చాలా బాగున్నాయి. ఈ విధంగా తక్కువ ఖర్చుతో అద్భుతమైన సేవలను అందించడంలో కేఎస్ఆర్ టీసీ మంచి పేరు సంపాధించింది. అలాంటి రవాణా సంస్థకు మరో అవార్డు వచ్చింది. ఆసియా బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ 2023గా కేఎస్ఆర్ టీసీ ఎంపికైంది.

శక్తి పథకం తర్వాత కేఎస్ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు సేవలు అందిస్తూ దేశంలోనే కాదు ప్రపంచంలోనే కేఎస్ఆర్ టీసీ పేరు మారుమోగుతోంది. ఇప్పటి వరకు మంచి సేవలందించి పేరు తెచ్చుకున్న కేఎస్‌ఆర్‌టీసీ మహిళలకు ఉచిత బస్సు సర్వీసు సేవలు అందిస్తూ ఇంకా బలం చేకూర్చినట్లు వినిపిస్తోంది. ఈ సమయంలో ఉపాధి కోసం ఉత్తమ బ్రాండ్‌గా కేఎస్ఆర్ టీసీ గుర్తించబడింది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు తమ రోజువారీ పనులకు కేఎస్ఆర్ టీసీ బస్సులపై ఆధారపడుతున్నారు.

KSRTC

అంతేకాదు కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేయడంలో కేఎస్ఆర్ టీసీ తన పాత్రను విజయవంతంగా నిర్వహిస్తున్నది. 2023 సంవత్సరానికి గానూ కేఎస్ఆర్ టీసీ ఆసియాలో అత్యుత్తమ ఎంప్లాయర్ బ్రాండ్‌గా ఎంపిక కావడం పట్ల ఆ సంస్థ ఆనందాన్ని పంచుకుంది. ఉత్తమ హెచ్‌ఆర్ ఇనిషియేటివ్స్ ఇంప్లిమెంటేషన్ విభాగంలో ఆసియా బెస్ట్ బ్రాండ్ ఎంప్లాయర్ అవార్డు 2023కి కేఎస్ఆర్ టీసీ ఎంపిక అయ్యింది.

KSRTC

18వ ఎంప్లాయర్ బ్రాండింగ్ అవార్డ్ యొక్క 14వ ఎడిషన్ ప్రకటించబడింది. ఈ అవార్డు కోసం కంపెనీ షార్ట్‌లిస్ట్ చేయబడింది. ఆగస్టు 17న సింగపూర్‌లో అవార్డు ప్రదానోత్సవం జరగనుందని కేఎస్ఆర్ టీసీ సంస్థ ట్వీట్ చేసింది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఒకటి. ఇలా మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు వీలుగా శక్తి పథకం అమలు చేశారు.

ఈ పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందడంతో పాటు రవాణా సంస్థల ఆదాయం కూడా భారీగా పెరిగింది. శక్తి పథకం కింద ప్రయాణించే మహిళా ప్రయాణీకులకు జీరో ఛార్జీలకే టిక్కెట్లు ఇస్తున్నారు. అయితే ఈ టికెట్ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. అందువలన కేఎస్ఆర్ టీసీ సంస్థలోని వివిధ విభాగాలకు ఇది భారీ ప్రయోజనం కలుగుతోందని ఆ సంస్థ అధికారులు అంటున్నారు.

రాష్ట్ర విద్యుత్ ప్రణాళికను ప్రకటిస్తున్న తరుణంలో రాష్ట్ర రవాణా సంస్థ సరికొత్త ఘనత సాధించింది. కర్ణాటకకు చెందిన పలు బ్రాండ్లు సందడి చేస్తుంటే, కర్ణాటక ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కూడా ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదేవిధంగా శక్తి పథకంకు వీలుగా ఆర్ టీసీ బస్సులు, సిబ్బంది కొరతను తీర్చేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

KSRTC

ఇప్పుడు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్న మహిళా ప్రయాణికులకు మరింత ఉపశమనం కలిగిస్తుందని అధికారులు భావిస్తున్నారు. కేఎస్ఆర్ టీసీ ఆదాయంలో ప్రధానంగా వాయువ్య కర్ణాటకలో బాగల్‌కోటే జిల్లా మొదటి స్థానంలో ఉంది. శక్తి పథకం అమలు చేసిన తర్వాత 2 నెలల్లో భారీ సంఖ్యలో మహిళల ప్రయాణించడంతో కేఎస్ఆర్ టీసీకి రూ. 27 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది.

శక్తి పథకం తర్వాత 2 నెలల్లో మొత్తం 1 కోటి 54 లక్షల మంది మహిళలు ప్రయాణించారు. ఇలా నష్టాల బాటలో ఉన్న కేఎస్ఆర్ టీసీ రవాణా సంస్థకు ఇప్పుడు రెట్టింపు ఆదాయం వచ్చింది. ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుండి, ఇప్పటివరకు 1 కోటి 54 లక్షల మంది మహిళా ప్రయాణికులు ప్రయాణించారు, ఇది సంస్థకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ డబ్బును కేఎస్ఆర్ టీసీకి కర్ణాటక ప్రభుత్వం అందిస్తుంది. మొత్తం మీద ఆసియాలోనే కేఎస్ఆర్ టీసీ నెంబర్ వన్ గా నిలిచి అవార్డు సొంతం చేసుకోవడంతో ఆ సంస్థ అధికారులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+