లింగాయిత్ ప్రత్యేక మతం: గ్రీన్ సిగ్నల్, మైనారిటీల రిజర్వేషన్ ఓకే, ఎన్నికల దెబ్బ !
బెంగళూరు: లింగాయిత్ ను ప్రత్యేక మతంగా గుర్తింపు ఇస్తూ ఆ వర్గాన్ని మైనారిటీలుగా గుర్తించాలని కర్ణాటక ప్రభుత్వం తీర్మానించింది. సోమవారం సీఎం సిద్దరామయ్య ఆధ్యర్యంలో జరిగిన ప్రత్యేక మంత్రి వర్గ సమావేశంలో లింగాయిత్ ను ప్రత్యేక మతంగా గుర్తించాలని నిర్ణయించారు.
అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన కర్ణాటక న్యాయశాఖ మంత్రి టిబి. జయచంద్ర లింగాయిత్ ను ప్రత్యేక మతంగా గుర్తించాలని, మైనారిటీలుగా గుర్తించి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామని వివరించారు.

లింగాయుతుల మత గురువు బసవన్న అని మంత్రి టిబి. జయకుమార్ అన్నారు. మంత్రి వర్గ సమావేశంలో ఎలాంటి విభేదాలు తలెత్తకుండా ఏకగ్రీవంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి టిబి. జయచంద్ర వివరించారు. అయితే లింగాయుతులకు ప్రత్యేక మతం, మైనారిటీ రిజర్వేషన్లు కల్పించే విషయంలో అదే వర్గానికి చెందిన కొందరు వ్యతిరేకిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఈ విషయంలో మౌనంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications