ఐటీ హబ్ ప్రజలకు షాక్, హుక్కా బార్ల బ్యాన్ కు ప్రత్యేక చట్టం, ఆ ప్రాంతాల్లో రూల్స్!
బెంగళూరు: ఎన్నో ఏళ్లుగా చర్చనీయాంశమైన హుక్కా బార్ల నిషేధంపై కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నది. కర్ణాటక రాష్ట్రంలో హుక్కా బార్లను నిషేధించేలా చట్టం తీసుకొస్తామని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే నష్టాల నివారణకు సంబంధించి మంగళవారం నిర్వహించిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, యువజన సాధికారత శాఖల ఉన్నతాధికారుల సమావేశం అనంతరం మంత్రి దినేష్ గుండూరావు మాట్లాడారు.
హుక్కా బార్లను నిషేధించాలని తీర్మానించామని, కానీ దీని కోసం ప్రత్యేక చట్టం తీసుకురాకపోతే హుక్కా బార్లను నిషేధించినా పెద్దగా ప్రయోజనం ఉండదని. కోర్టులో కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతుందని. అందుకోసం రాష్ట్రంలో హుక్కాబార్ నిషేధానికి ప్రత్యేక చట్టం రూపొందించి అమలు చేస్తామని మంత్రి దినేష్ గుండూరావ్ అన్నారు.

హుక్కా బార్ల వల్ల చిన్న పిల్లలు కూడా చెడిపోతున్నారని, యువత ఎక్కువగా వీటికి బానిసలై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని. హుక్కా కూడా పొగాకు ధూమపాన ప్రక్రియ అని. సమీప భవిష్యత్తులో హుక్కా బార్ యొక్క ఇన్‌స్టాలేషన్ అనుమతించబడదని. ఇందుకోసం ప్రత్యేక చట్టం రూపొందిస్తామని కర్ణాటక మంత్రి దినేష్ గుండూరావ్ అన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో హుక్కా బార్ల నిషేధానికి సంబంధించి ఆరోగ్య శాఖ, యువజన సాధికారత, క్రీడా శాఖ సహకారంతో మంత్రులు దినేష్ గుండూరావు, నాగేంద్ర నేతృత్వంలో వికాస్ సౌధలో ముఖ్యమైన సమావేశం జరిగింది. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తులను విక్రయించడం నిషేధం. ఇప్పుడు దేవాలయాలు, చర్చిలు, మసీదులు, ఆసుపత్రుల చుట్టూ కూడా పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

ఇప్పుడు 18 ఏళ్లు పైబడిన యువత పొగాకు ఉత్పత్తులను వినియోగించేందుకు అనుమతిస్తున్నారు. వారి వయసును 21 ఏళ్లకు పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. ఇది కేవలం ప్రకటన చేస్తే సరిపోదని, ఇది చట్టంగా రూపొందించబడాలని, వివిధ శాఖల భాగస్వామ్యంతో దీన్ని అమలు చేయాలని, ఇందుకోసం ప్రత్యేక బిల్లు తీసుకురావాలని మంత్రి దినేష్ గుండూరావ్ అన్నారు.
పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు దినేష్ గుండూరావు తెలిపారు. నేటి యువత డ్రగ్స్‌కు బానిసలై తమ విలువైన భవిష్యత్తును కోల్పోతున్నారని, ఈ నేపథ్యంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలను రూపుమాపేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కర్ణాటక మంత్రి దినేష్ గుండూరావ్ తెలిపారు.












Click it and Unblock the Notifications