నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు, ఇది వాళ్లపనే అని నాకు తెలుసు !
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గేని చంపేస్తామని బెదిరింపు లేఖ వచ్చింది. ఈ విషయాన్ని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే స్వయంగా మీడియాకు చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు. ఇదే సమయంలో తనను చంపేస్తామని బెదిరింపు లేఖలు వచ్చాయని చెప్పిన మంత్రి ప్రియాంక్ ఖార్గే అదే సమయంలో బీజేపీపై విరుచుకుపడ్డారు.
బీజేపీ అల్లర్లు సృష్టించి లోక్ సభ ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నదని మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ నాయకులు ప్లాన్ వేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కర్ణాటకలోని కలబురగిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రియాంక్ ఖార్గే తనను చేస్తామని బెదిరింపు లేఖలో బెదిరించారని ఆయన ఆరోపించారు.

బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో గందరగోళం సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కల్పించడానికి ప్రయత్నిస్తున్నదని, అల్లర్లు సృష్టించి ఎన్నికలు పెట్టాలని బీజేపీ నాయకులు అనుకుంటున్నారని ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు. కలబురిగి కాంగ్రెస్ కంచుకోట అని, ఇక్కడ ఎలాగైనా గెలిచేందుకు బీజేపీ నాయకులు పక్కా ప్లాన్ వేసుకుంటున్నారని మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు. తనను చంపేస్తామని తనకు రెండు బెదిరింపు లేఖలు వచ్చాయని మంత్రి అన్నారు.
నిన్ను ఎలాగైనా ఎదుర్కోంటామని ఒక లేఖలో బెదిరించారని, మరో లేఖలో తనను చంపేస్తామని బెదిరించారని మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు. ఇదే సమయంలో మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆయనకు వచ్చిన బెదిరింపు లేఖను కూడా చదివారు. పంచామృతంతో పూజ చేసినా నీ కులం మారదు. నువ్వు ఎలా వేషం వేసినా నీ కులం మారదు. నువ్వు మంత్రిగా ఉండు, రాజుగా ఉండు, నీ అహంకారం మాదిగ కులం బాటలో పయనిస్తుంది అంటూ లేఖలో అసభ్య పదజాలంతో తనను దూషించారని మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు.

నేను బెంగళూరులోని విధానసౌధ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే ఫిర్యాదు చెయ్యడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని మంత్రి ప్రియాంక్ ఖార్గే అన్నారు. వికాస సౌధలోని తన కార్యాలయానికి కలబురగి నుండే తనకు బెదిరింపు లేఖలు వచ్చాయని, మార్చి 13వ తేదీన తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని మంత్రి ప్రియాంక్ ఖార్గే తెలిపారు. అయితే మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపణలపై కర్ణాటకకు చెందిన బీజేపీ నాయకులు ఎలాంటి కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications