సాధారణ చీరతో సామూహిక వివాహంలో పెళ్లాడిన మంత్రి కూతురు
బెంగళూరు: ఏ మంత్రి అయినా తన కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిస్తారు! ఓ ఎమ్మెల్యే అయితేనే తమ పిల్లల పెళ్లి ఘనంగా జరిపిస్తారు. అయితే, కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి మాత్రం తన కూతురు పెళ్లిని సాముహిక వివాహాలలో జరిపించారు.

బలహీనవర్గాలకు చెందిన 96 జంటలతో పాటు తన కుమార్తె పెళ్లిని సదరు మంత్రి జరిపించారు. కర్నాటక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్ ఆంజనేయులు కూతురు అనుపమ ఈ నెల 19వ తేదీన చిత్రదుర్గలో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమానికి ఎలాంటి నగలు ధరించకుండా మామూలు చీరలో వచ్చి పెళ్లిపీటల పైన కూర్చున్నారు.
అందరితో పాటు ప్రభుత్వం ఇచ్చిన మంగళసూత్రాన్ని కట్టించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆంజనేయులు మాట్లాడుతూ.. తన కూతురు ఎన్నో ఫైవ్ స్టార్ హోటళ్లలో విందులు, వినోదాలకు హాజరయిందని, ఎంతోమంది ఉన్నత కుటుంబాల పెళ్లిళ్లకు వచ్చిందని కాని, ఇలా అన్నీవదిలి సాధారణ పెళ్లి చేసుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. తన కూతురు నిర్ణయం ఓ రాజకీయ సందేశాన్ని ప్రజలకు ఇచ్చిందన్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications