బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Omicron పేషెంట్ పరారీ, మరో 10 మంది విదేశీ ప్రయాణికులు మిస్సింగ్: గాలింపు ఉధృతం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో ఒమిక్రాన్ బారినపడిన ఇద్దరు రోగుల్లో ఓ రోగి పరారయ్యాడు. ఓ ప్రైవేట్ ల్యాబ్ నుంచి నెగెటివ్ సర్టిఫికేట్ తీసుకని పారిపోవడం గమనార్హం. ఈ మేరకు వివరాలను కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. అంతేగాక, బెంగళూరు విమానాశ్రయం నుంచి పరారైన మరో పది మంది కరోనా బాధితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపింది.

'ఈ రాత్రి వరకు తప్పిపోయినట్లు నివేదించబడిన మొత్తం 10 మంది వ్యక్తులను గుర్తించి, వారిని పరీక్షించాలి. నివేదిక వచ్చే వరకు ప్రయాణికులు విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించబడరు' అని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ ఓమిక్రాన్‌‌పై ఉన్నత స్థాయి సమావేశం అనంతరం వ్యాఖ్యానించారు.

Karnataka: Omicron Patient Escaped, Tracking 10 Missing Passengers

ఓమిక్రాన్-సోకిన 66 ఏళ్ల దక్షిణాఫ్రికా జాతీయుడు "పారిపోయాడు" అని మంత్రి చెప్పారు. అదే సమయంలో వచ్చిన దాదాపు 57 మంది ఇతర ప్రయాణికులను కూడా పరీక్షించామన్నారు. వారంతా RT-PCR నెగెటివ్ సర్టిఫికెట్ చూపినప్పటికీ వారికి పరీక్షలు చేశామని చెప్పారు. పారిపోయిన 10 మంది వ్యక్తు

తప్పిపోయిన 10 మంది వ్యక్తులు తమ ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేశారని, దీంతో వారిని ఫోన్ ద్వారా ట్రాకింగ్ చేయడం కుదరడం లేదని తెలిపారు. 'నెగటివ్ కోవిడ్ పరీక్షను చూపించిన తర్వాత కూడా వారిలో ఒకరు ఓమిక్రాన్‌కు పాజిటివ్‌గా తేలారు కాబట్టి అందరూ ఇప్పుడు పరీక్షించబడతారని మంత్రి చెప్పారు.

ఆ వ్యక్తి దక్షిణాఫ్రికా నుంచి నవంబర్ 20వ తేదీన వచ్చి ఏడు రోజుల తర్వాత దుబాయ్ వెళ్లిపోయాడు. 'మేము పోలీసులకు ఫిర్యాదు చేసాము. షాంగ్రి-లా హోటల్‌లో ఏమి తప్పు జరిగిందో వారు చూస్తారు, అక్కడ నుండి వ్యక్తి తప్పించుకున్నాడు' మంతరి అని చెప్పారు.

అతడు పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అతడు కరోనా బారినపడినట్లు పరీక్షల అనంతరం తేలిందని మంత్రి తెలిపారు. అంతేగాక, అతడు నెగెటివ్ సర్టిఫికేట్ తో ఇక్కడకు వచ్చాడని చెప్పారు. కరోనా సోకడంతో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని అతడ్ని పరీక్షించిన వైద్యులు సూచించారు. ఆ తర్వాత అతడి నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కి పంపారు.

సుమారు 24 మంది అతడ్ని కలిశారని, అయితే వారంతా కరోనా నెగెటివ్ గా తేలిందన్నారు. వారి సెకండరీ కాంటాక్ట్ అయిన మరో 240 మంది కూడా కరోనా నెగెటివ్ నిర్ధారణ అయ్యారు.

కాగా, నవంబర్ 27న కరోనా బారిన పడిన వ్యక్తి హోటల్ నుంచి పారిపోయాడని అధికారులు తెలిపారు. ఓ క్యాబ్ ద్వారా విమానాశ్రయానికి చేరుకుని అక్కడ్నుంచి దుబాయ్ కి వెళ్లాడని చెప్పారు. ఒమిక్రాన్ అని తేలినప్పటికీ.. అప్పటికే అతడు దేశం దాటి వెళ్లాడు.

Recommended Video

Omicron Variant : Covaxin May Have Edge - ICMR Officials || Oneindia Telugu

దక్షిణాఫ్రికాతోపాటు ఇతర దేశాల నుంచి కర్ణాటకకు వచ్చే ప్రయాణికులను అందరినీ పరీక్షిస్తున్నామని, లక్షణాలుంటే క్వారంటైన్ చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్ తెలిపారు. ఇప్పటికే పరారైన కరోనా బాధితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారని చెప్పారు. ప్రయాణికులు కూడా పరీక్షలు చేసుకోవాలని, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

English summary
Karnataka: Omicron Patient Escaped, Tracking 10 Missing Passengers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X