కర్ణాటక పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ లీడ్ -ఇప్పటికే 4,228 స్థానాల్లో గెలుపు, కాంగ్రెస్‌కు2,265
దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో స్థానిక ఎన్నికల్లోనూ కమలదళం మెజార్టీ దిశగా వెళుతోంది. రాష్ట్రంలోని మొత్తం 6004 గ్రామపంచాయితీలు ఉండగా, వాటిలో 5,728 గ్రామ పంచాయితీలు, 226 తాలూకా పంచాయితీలకు ఇటీవల ఎన్నికలు నిర్వహించారు. వాటి ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి.
పార్టీల గుర్తులు లేకుండా నిర్వహించిన ఎన్నికల్లో కొవిడ్ నిబంధనల కారణంగా కౌంటింగ్ మందకోడిగా సాగుతోంది. బుధవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభం కాగా, రాత్రి 9 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం చాలా చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించి, లీడ్ లో కొనసాగుతున్నారు.

మొత్తం 82వేల 616 వార్డులకుగానూ ఇప్పటివరకు.. బీజేపీ బలపర్చిన 4,228 మంది అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ 2,265 స్థానాలను కైవసం చేసుకుని రెండో స్థానంలో కొనసాగుతున్నది. 1,167 స్థానాలను గెలుచుకున్న జేడీఎస్ మూడో స్థానానికి పరిమితం అయింది. 678 స్థానాల్లో ఇండిపెండెట్లు గెలుపొందారు. ఇంకా..
కౌంటింగ్ ఇంకా కొనసాగుతుండగానే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా విజయ ప్రకటలను చేయడం గమనార్హం. బ్యాలెట్ పత్రాలతో నిర్వహించిన ఎన్నికలు కావడం, కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు టేబుళ్లు, ఎక్కువ రౌండ్లతో లెక్కింపు జరుగుతుండటంతో గురువారం మధ్యాహ్నం తర్వాతగానీ తుది ఫలితాలు వచ్చే అవకాశంలేదు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications