Karnataka Polls : బీజేపీ, జేడీఎస్ కు ఒక్కో ఎమ్మెల్యే గుడ్ బై-కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ..
కర్నాటకలో ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా రాష్ట్రంలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటూ తాజాగా వెలువడిన సర్వేల నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మారేలా కనిపిస్తోంది. ఇప్పటికే జేడీఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేయగా.. బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే సొంత పార్టీని వీడారు. వీరంతా కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు.
తాజాగా జేడీఎస్ అర్కాల్గుళ్ ఎమ్మెల్యే ఏటీ రామస్వామితో పాటు బీజేపీ కుడ్గిగి ఎమ్మెల్యే గోపాలకృష్ణ తమ పార్టీలకు రాజీనామా చేశారు. వీరిద్దరూ కాంగ్రెస్ టికెట్లు తెచ్చుకుని వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నారు. ఇప్పటికే జేడీఎస్ ను వీడిన ఎమ్మెల్యే ఎస్ఆర్ శ్రీనివాస్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోయారు. జేడీఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యే కేఎం శివలింగే కూడా ఆ పార్టీని వీడి త్వరలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

కర్నాటకలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఏబీపీ-సీ ఓటర్ సర్వే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి ఆ తర్వాత బీజేపీ పంచన చేసిన ఎమ్మెల్యేలతో పాటు అప్పట్లో మిత్రపక్షంగా ఉన్న జేడీఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ జపం చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో బీజేపీకి కష్టాలు తప్పేలా లేవు. అదే సమయంలో కింగే మేకర్ కావాలనుకుంటున్న జేడీఎస్ నేత కుమార స్వామి కలలు కూడా నెరవేరేలా లేవు.












Click it and Unblock the Notifications