Karnataka Polls : ముస్లిం రిజర్వేషన్లు ఎందుకన్న యోగీ ఆదిత్యనాథ్- దేశాన్ని మతపరంగా విడగొట్టాక..
దేశంలో ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు ఇస్తున్నారని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. దేశాన్ని ఓసారి మతపరంగా విభజించిన తర్వాత ముస్లింలకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారని యోగీ నిలదీశారు. ఇవాళ కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగీ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్నాటక ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ గా బరిలోకి దిగిన యోగీ.. వచ్చీరావడంతోనే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ల తొలగింపును సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) వంటి సంస్థలకు మద్దతు ఇస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. 1947లో దేశం మత ప్రాతిపదికన విభజించబడినందున ముస్లింలకు రిజర్వేషన్లు సాధ్యం కాదని పేర్కొన్నారు. కర్ణాటకలో హిందుత్వ ప్రభావం ఉన్న ప్రాంతాలలో ఒక రోజు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటున్నారు.

కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రిజర్వేషన్ పరిమితిని 50 శాతం నుండి 75 శాతానికి పెంచడానికి, వారి జనాభా ఆధారంగా అన్ని కులాలకు రిజర్వేషన్లు పెంచడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ట్వీట్ చేసిన నేపథ్యంలోయోగీ ఈ వ్యాఖ్యలు చేశారు.
గత ఆరేళ్లలో యూపీలో ఎలాంటి అల్లర్లు జరగలేదని, కర్ఫ్యూ లేదని యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. కర్నాటకలో పిఎఫ్‌ఐ వంటి సంస్థల వెన్నెముక విరిచిన డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు యోగీ పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం పీఎఫ్ఐని నిషేధిస్తుందని, కానీ కాంగ్రెస్ దాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. కాంగ్రెస్ మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తుందని, మతం ఆధారంగా రిజర్వేషన్ భారత రాజ్యాంగానికి విరుద్ధమన్నారు.
#WATCH | "Reservation on the basis of religion is against the Constitution of India," says Uttar Pradesh CM & BJP leader Yogi Adityanath in Karnataka's Mandya District. pic.twitter.com/c4Iy81luFI
— ANI (@ANI) April 26, 2023












Click it and Unblock the Notifications