కర్నాటక ముఖ్యమంత్రి: మోడీ నేతృత్వంలో బీజేపీ భేటీ, ఢిల్లీకి యెడ్యూరప్ప

బెంగళూరు: కర్నాటకలో బీజేపీ ఘన విజయం నేపథ్యంలో ఆ పార్టీ పెద్దలు బుధవారం సాయంత్రం భేటీ కానున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు, ఇతర ముఖ్య నాయకులు ఢిల్లీలో సాయంత్రం ఆరు గంటలకు మోడీ నేతృత్వంలో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.

బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చిన నేపథ్యంలో యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యెడ్యూరప్ప ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన దేశ రాజధానిలో బీజేపీ పెద్దలను కలుస్తారు.

Karnataka results: BJP will meet today

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాజిక్‌ ఫిగర్ 113 దాటింది. దీంతో కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ నేతలు నమ్మకంగా ఉన్నారు. తొలి రౌండ్లలో పోటా పోటీగా ఉన్న కాంగ్రెస్‌ ఆ తర్వాత వెనుకబడిపోయింది. జేడీఎస్‌ మూడో స్థానంలో ఉంది.

జేడీఎస్‌తో పొత్తు విషయంపై బీజేపీ నేత సదానంద గౌడ మాట్లాడుతూ.. అసలు పొత్తు ప్రశ్నే లేదన్నారు. బీజేపీ నూటా పదికి పైగా స్థానాలు సాధిస్తుందన్నారు. తాము సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు.

మరోవైపు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్ బెంగుళూరుకు బయలుదేరారు. ఆయన కర్ణాటకకు పార్టీ ఇంచార్జ్‌గా ఉన్నారు. బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలను దగ్గర ఉండి పరిశీలించనున్నారు. అంతకంటే ముందు బీజేపీ జాతీయాధ్యక్షులు అమిత్‌ షాను ఆయన నివాసంలో కలిసి చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+