కర్ణాటక ఫలితాలు: సంబరాల్లో కాంగ్రెస్.. సంచలన ట్వీట్; సిమ్లాలో ప్రియాంక పూజలు!!
కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఎర్లీ ట్రెండ్స్ లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాలను చూసి సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ చేసింది.
కాంగ్రెస్ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన వీడియో ని షేర్ చేసి నేను అజేయుడ్ని, నేను చాలా నమ్మకంగా ఉన్నాను.. ఈ రోజు మమ్మల్ని ఎవరూ ఆపలేరు అంటూపేర్కొంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం లో మునిగిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో ఆధిక్యతను ప్రదర్శిస్తున్న నేపధ్యంలో భారత్ జోడోయాత్ర ప్రభావం ఎక్కువగా చూపించిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఎన్నికలలో భారీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు. విజయం సాధించే విషయంలో ఎటువంటి సందేహం లేదని, ఓటర్లను విభజించేందుకు ప్రయత్నించిన ప్రధాని ప్రచారం పని చేయలేదని ఆయన విమర్శించారు. బీజేపీకి కర్ణాటక ఓటర్లు సరైన బుద్ధి చెప్తారన్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ దాదాపు 50 స్థానాల్లో బిజెపి కంటే ముందంజలో ఉన్నట్లు సమాచారం.
దీంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.మరోవైపు కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎప్పటికప్పుడు ఫలితాలపై ఆరా తీస్తున్నారు. పూర్తిస్థాయిలో ఫలితాలు వచ్చిన తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలకు ఇప్పటి నుండే పదును పెడుతున్నారు.
#WATCH | Congress General Secretary Priyanka Gandhi Vadra offers prayers at Shimla's Jakhu temple pic.twitter.com/PRH47u36Zm
— ANI (@ANI) May 13, 2023
కర్ణాటక ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో ఈ రోజు సిమ్లా జిల్లాలోని ఆలయంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పూజలు నిర్వహించారు. సిమ్లా లోని జఖూ లోని హనుమాన్ ఆలయం లో ప్రియాంక గాంధీ దేశం కోసం, కర్ణాటక శాంతి కోసం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications