కర్నాటకలో బీజేపీకి షాక్, ఊహించని మలుపు: మళ్లీ హంగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని మలుపు. ఫలితాలు ప్రారంభంలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించే దిశగా కనిపించాయి. ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా ఊహించని మలుపులు తిరిగింది.

కర్నాటకలో జేడీఎస్ ఆశలు గల్లంతు, కాంగ్రెస్ వ్యూహం రివర్స్: బీజేపీ చేతికి 21వ రాష్ట్రం

బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని ఫలితాలను బట్టి అర్థం కావడంతో బెంగళూరు, ఢిల్లీలోని ఆ పార్టీ కార్యాలయాల్లో సంబరాలు చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ తర్వాత మలుపు తిరిగింది. ప్రారంభంలో కాంగ్రెస్ దూసుకెళ్లింది. ఆ తర్వాత బీజేపీ ముందుకెళ్లింది.

Karnataka results: Though BJP is leading it is still cliffhanger

ఓ దశలో బీజేపీకి 115 సీట్లకు మించి వస్తాయని ఫలితాల ట్రెండ్‌ను బట్టి అర్థమైంది. కానీ ఓ రెండు గంటల పాటు బీజేపీ దూసుకెళ్లినట్లుగా కనిపించింది. కానీ అంతలోనే మళ్లీ హంగ్ వైపు మలుపు తిరిగింది.

మెజార్టీకి కావాల్సింది 224 స్థానాలకు గాను 222 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. 112 మార్జిన్ ఫిగర్. అయితే 115 సీట్లకు పైగా గెలుచుకుంటుందని భావించిన బీజేపీ ఆధిక్యం ఆ తర్వాత కొంత తగ్గింది. ఎనిమిది నుంచి పది స్థానాలు తగ్గి.. 106 స్థానాలకు వచ్చింది. దీంతో మళ్లీ హంగ్ దిశగా సాగుతోంది. హంగ్ వస్తే జేడీఎస్ ఆశలు తిరిగి పుంజుకున్నట్లే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Though BJP is leading it is still cliffhanger Karnataka Assembly Election results 2018.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X