సెక్స్ స్కాండల్: కర్ణాటక మంత్రికి క్లీన్ చిట్ ఇవ్వనున్న సీఐడీ!?

Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: ఏకంగా అసెంబ్లీలోనే ఓ మహిళతో రాసలీలు వెలగబెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎక్సైజ్ మంత్రి హెచ్.వై.మేటీకి తాజాగా సీఐడీ క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీడియోలు సైతం బయటకు పొక్కడంతో మంత్రి రాసలీల వ్యవహారం కర్ణాటకలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

రాసలీలల ఆరోపణలతో గతేడాది డిసెంబర్ లో మేటీ తన పదవికి రాజీనామా కూడా చేశారు. ఈ మేరకు సీఎం సిద్ద రామయ్యకు స్వయంగా రాజీనామా లేఖ అందజేశారు. అక్కడి టీవి చానెళ్లు సైతం మేటీ రాసలీలను ప్రసారం చేయడంతో.. అధికారి కాంగ్రెస్ పార్టీకి ఆయన వ్యవహారం తలనొప్పిలా తయారైంది.

విధాన సౌధలో మంత్రి రాసలీలలు: వీడియో విడుదల, రాజీనామా

Karnataka: Sex scam scarred HY Meti to get away?

తాజాగా ఆయనకు సీఐడీ క్లీన్ చిట్ ఇస్తున్నట్లు వార్తలు వస్తుండటంతో.. ఈ పరిణామం కాంగ్రెస్ కు ఒకింత రిలీఫ్ అని చెప్పాలి. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు.. మరో వారం రోజుల్లోగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. తగిన సాక్ష్యాధారాలు లేనందువల్లే మేటికి క్లీన్ చిట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CID sleuths may give former Excise Minister H.Y. Meti a clean chit in the sex scandal that cost him his position.
Please Wait while comments are loading...