పెళ్లికి నో చెప్పిన పదేళ్ల పిల్లాడి తల్లి.. ప్రేమ ఉన్మాదానికి ఇద్దరు బలి!
నమ్మిన స్నేహమే ప్రాణాలు తీసింది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన స్నేహితుడు ప్రేమ ఉన్మాదిగా మారి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కనికరం లేని కోపంతో స్నేహితురాలిని దారుణంగా హత్య చేసి, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని యల్లాపుర పట్టణంలో కలకలం రేపింది.
స్కూల్ ఫ్రెండ్స్.. కానీ మనసులో విషం
బాధితురాలు రంజిత బనసోడె, నిందితుడు రఫీక్ ఇమామ్సాబా చిన్ననాటి స్నేహితులు. ఒకే పాఠశాలలో చదువుకున్న వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. రంజితకు 12 ఏళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన సచిన్ కటేరాతో వివాహం జరగగా.. వారికి 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా రంజిత తన భర్తకు దూరంగా ఉంటూ యల్లాపురలోని పుట్టింట్లో నివసిస్తోంది. అక్కడ ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సహాయకురాలిగా పని చేస్తూ తన కుమారుడిని పెంచుకుంటోంది.

వేధింపులే శాపం
స్నేహితుడు కావడంతో రఫీక్ తరచుగా రంజిత ఇంటికి వచ్చి భోజనం చేసేవాడు. రంజిత కుటుంబం కూడా అతడిని నమ్మి ఆదరించింది. కానీ రఫీక్ మనసులో మరో ఆలోచన మొదలైంది. రంజితను పెళ్లి చేసుకోవాలని అతను ఆమెపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించాడు. ఇప్పటికే వివాహిత అయిన రంజిత, ఆమె తల్లిదండ్రులు ఈ ప్రతిపాదనను ఖరాఖండిగా తిరస్కరించారు. ఇది మనసులో పెట్టుకున్న రఫీక్ ఆమెపై పగ పెంచుకున్నాడు.
దారి కాచి దాడి.. రక్తం మడుగులో వివాహిత
శనివారం రంజిత పాఠశాలలో పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రఫీక్ అడ్డుకున్నాడు. వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చేలోపే రఫీక్ అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన రంజితను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది.
అడవిలో శవమైన నిందితుడు
హత్య అనంతరం పరారైన రఫీక్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కొన్ని గంటల తర్వాత సమీపంలోని అడవిలో అతను చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని మృతదేహం వద్ద ఒక మద్యం సీసా, తాడు లభ్యమయ్యాయి. హత్య చేసిన పశ్చాత్తాపంతోనో లేక పోలీసులకు దొరికిపోతాననే భయంతోనో అతను ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
పోలీసుల చర్యలు
ఈ ఘటనపై ఉత్తర కన్నడ ఎస్పీ దీపన్ ఎం.ఎన్ స్పందిస్తూ.. నిందితుడిపై హత్య కేసుతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. కేవలం ఒక్క 'నో' చెప్పినందుకు ఒక మహిళను హత్య చేయడం సమాజంలో పెరిగిపోతున్న ప్రేమ ఉన్మాదానికి నిదర్శనమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications