రాష్ట్రవ్యాప్తంగా టీ, కాఫీ విక్రయాలు బంద్..ఎందుకంటే?
Karnataka: కర్ణాటక రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, టీ, కాఫీ షాపులు, బేకరీలు నిర్వహించే వారు జీఎస్టీ అధికారుల నుంచి వచ్చిన నోటీసులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా బేకరీల్లో టీ, కాఫీ, పాల విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుతున్నారు. డిజిటల్ లావాదేవీల ఆధారంగా జీఎస్టీ అధికారులు తమను లక్ష్యంగా చేసుకుని నోటీసులు పంపిస్తున్నారంటూ వారు ఈ ఆందోళన చేపడుతున్నారు.
వార్షికంగా రూ. 40 లక్షలకు పైగా టర్నోవర్ ఉందన్న అనుమానంతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపారం చేస్తున్నారని పేర్కొంటూ నోటీసులు జారీ చేయడాన్ని చిరు వ్యాపారులు దౌర్జన్యంగా అభివర్ణిస్తున్నారు. ఈ క్రమంలోనే జులై 23, 24 తేదీల్లో కర్ణాటక వ్యాప్తంగా టీ, కాఫీ, పాల విక్రయాలు నిలిపివేశారు. బేకరీ, కిరాణా షాపులు, ఇతర చిన్న వ్యాపార సంస్థలు టీ, కాఫీ, పాల విక్రయాలను బంద్ చేశాయి. ఈ నిరసనలో భాగంగా యూపీఐ చెల్లింపులను పూర్తిగా నిలిపివేసి "క్యాష్ ఓన్లీ" విధానాన్ని అమలు చేస్తున్నారు. తమ అసమ్మతిని తెలియజేసేలా వ్యాపారులు బ్లాక్ టీ, బ్లాక్ కాఫీని మాత్రమే అమ్ముతున్నారు. కొందరు వ్యాపారులు బ్లాక్ బ్యాడ్జిలు ధరించి తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు.కర్ణాటక స్టేట్ అసోసియేషన్ ఆఫ్ బేకరీస్, కాండిమెంట్స్ అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ సంఘాలు ఆధ్వర్యంలో జులై 25న బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్లాన్స్ రూపొందించారు. జీఎస్టీ విభాగం నోటీసులను వెనక్కి తీసుకోకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

స్పందించిన కర్ణాటక ప్రభుత్వం
ఈ రోజు ఏ బేకరీలో కూడా పాల విక్రయాలు జరపడం లేదని.. నిరసనకు గుర్తుగా బ్లాక్ టీ మాత్రమే అమ్ముతున్నామని.. ఈ రోజు మేము బ్లాక్ బ్యాడ్జిలను ధరించామని కార్మిక హక్కుల కార్యకర్త రవిశెట్టి మీడియాతో వెల్లడించారు. ఈ క్రమంలో కర్ణాటక సర్కారు స్పందించింది. చిరు వ్యాపారుల ప్రతినిధులతో చర్చించేందుకు మధ్యాహ్నం 3 గంటలకు తన నివాసంలోనే సీఎం సిద్ధరామయ్య సమావేశం కానున్నారు. 2021 నుంచి 2024 మధ్య కాలంలో యూపీఐ లావాదేవీల ఆధారంగా టర్నోవర్ లెక్కించి వాణిజ్య పన్నుల శాఖ జీఎస్టీ నోటీసులు జారీ చేసింది. యూపీఐ పేమెంట్లు రూ.20 లక్షలు(సేవలు), రూ. 40లక్షలు(వస్తువులు) దాటిని వ్యాపారులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. హావేరి జిల్లాకు చెందిన కూరగాయల వ్యాపారి శంకర్ గౌడ్‌కు రూ.1.63 కోట్ల టర్నోవర్ ఆధారంగా రూ. 29 లక్షల జీఎస్టీ కట్టాలని నోటీసు వచ్చింది. ఈ క్రమంలో వ్యాపారులు యూపీఐ సేవలను విస్మరిస్తూ నగదు లావాదేవీలవైపు మొగ్గుచూపుతున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications