కావేరి చిచ్చు: 1990 టూ 2016 వాటర్ వార్
బెంగళూరు: కావేరీ నీటి పంపణి విషయంలో కర్ణాటక-తమిళనాడు రాష్ణ్రాల మధ్య 1990 నుంచి గొడవ జరుగుతున్నది. కావేరీ నీటీని మాకు వదిలి పెట్టాలని తమిళనాడు న్యాయపోరాటం చేస్తున్నది.
ముఖ్యంగా జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావేరీ నీటి పంపిణి విషయంలో గొడవలు ఎక్కువ అవుతున్నాయి. 1991లో తమిళనాడుకు 205 టీఎంసీల నీరు విడుదల చెయ్యాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అప్పుడు తమిళనాడులో జయలలిత, కర్ణాటకలో ఎస్. బంగారప్ప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అయితే తన ప్రాణం పోయినా సరే కావేరికి నీరు వదిలిపెట్టనని అప్పటి ముఖ్యమంత్రి బంగారప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు.

జయలలిత పోరాటం
కావేరీ నీటితో తమ రైతుల జీవితాలు ఆదుకుంటామని బంగారప్ప అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. బంగారప్ప నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జయలలిత న్యాయపోరాటం చేశారు.

న్యాయస్థానం ఆదేశాలతో
తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల వాదనలు విన్న న్యాయస్థానం వెంటనే తమిళనాడుకు నీరు వదిలి పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం తీర్పుకు కట్టుబడిన కర్ణాటక అప్పట్లో తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చేసింది.

కర్ణాటక బంద్
కావేరీ నీరు తమిళనాడుకు వదిలిపెట్టరాదని 1991 డిసెంబర్ 13వ తేదిన కర్ణాటక బంద్ నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం పరోక్షంగా బంద్ కు మద్దతు ఇచ్చింది. రెండు వారాల పాటు కర్ణాటకలో ఆందోళనలు నిర్వహించారు.

1997లో కావేరీ రివర్ అథారిటీ
1997లో కావేరీ రివర్ అథారిటీ ఏర్పాటు చేశారు. కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు కావేరీ నీటి విషయంలో ఫైట్ చేశాయి.

వాజపేయి అధ్యక్షతన సమావేశం
2003 ఫిబ్రవరిలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి అధ్యక్షతన కావేరీ రివర్ అథారిటీ సమావేశం జరిగింది.

జయలలిత డిమాండ్
కావేరి డెల్టాలో వేసిన పంటలు కాపాడడానికి అప్పటి ముఖ్యమంత్రి జయలలిత పోరాటం చేశారు. వెంటనే కావేరీ నీటిని విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.

యుపీఏ ప్రభుత్వంలో
2004 యుపీఏ అధికారంలో వచ్చిన తరువాత అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన కావేరీ రివర్ అథారిటీ సమావేశం జరిగింది. అయితే కావేరీ నీటి పంపిణి విషయం కొలిక్కిరాలేదు.

సుప్రీం కోర్టులో ఫిర్యాదు
కావేరీ నీరు పంపిణి చెయ్యడం లేదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

2007లో గొడవ
కావేరీ నదీ జలాల ట్రిబ్యునల్ రూపొందించిన ఫార్ములా ప్రకారం నీటిని పంపిణి చెయ్యడానికి కర్ణాటక ప్రభుత్వం నిరాకరించింది.

కన్నడిగుల పోరాటం
తమిళనాడుకు కావేరీ నీరు వదిలిపెట్టరాదని కన్నడిగులు పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రభుత్వాలు తమిళనాడుకు నీరు వదిలిపెడుతున్నాయి.

రెండు రాష్ణ్రాల మధ్య చిచ్చు
తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ నీటి పంపిణి విషయంలో చిచ్చురేపుతున్నది. ప్రతి సంవత్సరం రెండు రాష్ట్రాలు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాయి.












Click it and Unblock the Notifications