కేంద్రంపై పోరుకు చంద్రబాబును ఆహ్వానించిన కర్నాటక-కారణం ఇదే..!
కేంద్రంలో వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన ఎన్డీయే కూటమికి బీజేపీయేర రాష్ట్రాలతో అస్సలు పొసగడం లేదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కేంద్రంలోని అధికార బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటకలో కాంగ్రెస్ సర్కార్ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రంపై పోరుకు ఏకంగా 8 రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పలికింది.
పన్నుల పంపిణీలో కేంద్రం చేస్తున్న అన్యాయానికి నిరసనగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు 8 రాష్ట్రాల సీఎంలను బెంగళూరు రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందులో దక్షిణాదిలోని కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఉత్తరాదిన ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, పంజాబ్ సీఎంలు కూడా ఉన్నారు. అయితే ఇందులో ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, హర్యానా సీఎం నాయబ్ సైనీను కూడా ఆహ్వానించడం విశేషం.

త్వరలో బెంగళూరులో ముఖ్యమంత్రుల స్థాయి సదస్సు ఏర్పాటు చేయాలని కర్నాటకలో సిద్ధరామయ్య సర్కార్ నిర్ణయించింది. దీనికి హాజరు కావాలని సీఎంలు చంద్రబాబు, పినరయి విజయన్, ఎంకే స్టాలిన్, రేవంత్ రెడ్డి, ఏక్ నాథ్ షిండే, భగవంత్ సింగ్ మాన్ , నాయబ్ సైనీని ఆహ్వానించింది. డాక్టర్ అరవింద్ పనగారియా ఆధ్వర్యంలోని 16వ ఆర్థిక సంఘం 2025లో తన నివేదికను కేంద్రానికి సమర్పించే ముందు వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్న తరుణంలో ఈ ఆహ్వానం
ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్ధిక సంఘం పన్నుల పంపిణీపై చేసే సిఫార్సులు వచ్చే ఐదేళ్లకు వర్తిస్తాయి.












Click it and Unblock the Notifications