Gay APP: ఇంట్లో భార్య.. యాప్‌లో భర్త: మూడేళ్లుగా అతను వారితోనే..చివరకు ఇలా..!!
యువతికి 31 ఏళ్ల వయసు. భర్తకు 34 ఏళ్లు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. 2018 లో ఇద్దరికీ వివాహం అయింది. ఇద్దరూ చూడ ముచ్చటగా ఉన్నారు. భర్త మంచి సంపాదన పరుడు కావటంతో భార్య సంతోష పడుతుందని యువతి తల్లితండ్రులు ఆశించారు. కానీ, అసలు విషయం ఎవరికీ తెలియలేదు. కర్ణాటకలోని బవసణ్నగుడి పరిధిలో చోటు చేసుకున్న ఘటన ఇది. పెళ్లయి మూడేళ్లు అవుతున్నా..వారిద్దరి మధ్య ఇప్పటి వరకు కార్యం జరగలేదు.

భార్య వెయిట్ చేస్తున్నా..స్పందన లేని భర్త..
భార్య ఎంత ప్రయత్నించినా భర్త లో ఆ స్పందనే లేదు. రోజు ఏదో ఒక కారణం చెప్పి ఆమెతో పడక గదిలో గడపడం లేదు. కానీ, ఫోన్ లో మాత్రం పిచ్చ బిజీగా ఉంటాడు. దీంతో.. మరో యువతితో ఛాటింగ్ లో ఉన్నాడా అనే అనుమానం భార్యకు వచ్చింది. కానీ, బయట పడలేదు. వరకట్నం అడిగినంత ఇస్తేనే నీతో కలుస్తానని చెప్పాడు. అడిగినంత డబ్బు ఇస్తున్నా కలయికకు అయిష్టంగా ఉండటంతో ఇక, భార్య తన భర్త ఫోన్ చూసి షాక్ అయింది. అసలు విషయంలో ఆ ఫోన్ తో బయట పడింది.

పురుషులతో ఛాటింగ్.. స్వలింగ సంపర్కుడని..
అతడు పురుషులతో లైంగికపరమైన విషయాలు చాటింగ్ చేస్తున్నాడు. దీంతోపాటు గే యాప్‌లలో ఆయన ప్రొఫైల్ ఉంది. ఇది చూసి ఆమె షాక్‌కు గురయ్యింది. వెంటనే అతడిని నిలదీయగా అసలు మేటర్ లేదని బాంబు పేల్చాడు.తాను స్వలింప సంపర్కుడినని.. గే డేటింగ్ యాప్‌లలో ప్రొఫైల్ ఉందని అంగీకరించాడు. దీంతో ఆమె అతడితో విడిపోవాలని నిశ్చయించుకుంది. ప్రస్తుతం వీరి దాంపత్య జీవనం కోర్టు మెట్లు ఎక్కింది. విడాకులు కావాలని భార్య న్యాయస్థానంలో పోరాడుతోంది.

రగిలిపోయిన భార్య... ఒక ఆట ఆడుకుంది
అయితే అతడి మొదటి భార్య కూడా ఇదే కారణంతో అతడిని వదిలేసి ఉంటుందని అనుమానించి వారిని ఆరా తీసారు. ఆతను భార్యతో కాకుండా.. పురుషులతో సన్నిహితంగా మెలగటం చూసి ..తాము వదిలించకున్నామని మొదటి భార్య తరపు బంధువుల చెప్పారు. అంతే..ఈ సాఫ్ట్ వేర్ యువతి రగలిపోయింది. విషయం ముందే తెలిసీ తనకు అతడితో పెళ్లి చేశారని బాధితురాలు భర్త కుటుంబసభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భర్త వ్యవహారంతో పాటుగా వారిని ఒక ఆట ఆడుకుంది. పోలీసు స్టేషన్ లో పంచాయితీ పెట్టి.. నిజం నిగ్గు తేల్చింది. దీంతో..పోలీసుల సూచనతో న్యాయ పోరాటానికి దిగింది.












Click it and Unblock the Notifications