ఎయిర్ పోర్టులో మాజీ సీఎంల మంతనాలు, కొత్త రాజకీయాలకు తెరలేచిందా, తీవ్రస్థాయిలో చర్చ!

హుబ్బళి (కర్ణాటక): ప్రతినిత్యం ఎదో ఒక విషయంలో విమర్శలు చేసుకుంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మాజీ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప ఒకే చోట కలిసి ఒకరిని ఒకరు ఉల్లాసంగా పలకరించుకున్నారు.

మాజీ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, యడ్యూరప్ప భేటీ కావడంతో కొత్త రాజకీయాలకు తెరలేసిందా అంటూ చర్చ మొదలైయ్యింది. మాజీ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, యడ్యూరప్పల భేటీ కొత్త రాజకీయాలకు నాంధి అంటూ కర్ణాటకలో ఇప్పుడు చర్చ మొదలైయ్యింది.

Karntaka former chief ministers BS Yeddyurappa and Siddaramaiah met with each other in Hubballi airport.

హుబ్బళిలో జరుగుతున్న వేర్వేరు కార్యక్రమాలకు హాజరుకావడానికి మాజీ ముఖ్యమంత్రులు బీఎస్. యడ్యూరప్ప, సిద్దరామయ్య ఒకే విమానంలో బెంగళూరు నుంచి హుబ్బళి వెళ్లారు. హుబ్బళి ఎయిర్ పోర్టులో ఇద్దరు విమానం దిగిన సమయంలో ఒకరి గురించి ఒకరు వివరాలు తెలుసుకుని ముచ్చటగా చర్చించుకున్నారు.

వేరేవేరే కార్యక్రమాలకు హాజరు కావలసిన మాజీ ముఖ్యమంత్రులు బీఎస్. యడ్యూరప్ప, సిద్దరాయ్య హుబ్బళి ఎయిర్ పోర్టు నుంచి వెళ్లిపోయారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో నిత్యం దళితులకు అన్యాయం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ వాపోయిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ దళితులకు న్యాయం జరగలేదని, అన్యాయం జరుగుతోందని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో నిత్యం దళితులకు మోసం జరుగుతోందని మాజీ ముఖ్యమంత్రి బీఎస్, యడ్యూరప్ప విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రులు భేటీ విషయంలో ఏమి చర్చ జరిగిందని మీడియా యడ్యూరప్పను ప్రశ్నించగా ఈ విషయంపై సిద్దరామయ్యను ప్రశ్నించాలని యడ్యూరప్ప చిన్నగా తప్పించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+