కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభించనున్న మోడీ.. మరుసటి రోజు వెళ్లనున్న మన్మోహన్‌ సింగ్

కర్తార్ పూర్ కారిడార్‌ను నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నట్లు కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు. డేరా బాబా నానక్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగుతుందని ఆమే చెప్పారు. ప్రధానితోపాటు పంజాబ్ సీఎం అమరిందర్‌సింగ్ ,ఇతర ప్రజాప్రతినిధులు హజరుకానున్నట్టు ప్రకటించారు. కాగా కారిడార్ ప్రారంభం తర్వాత మరుసటి రోజు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ వెళ్లనున్నారు. కాగా, పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ కారిడార్‌ను నవంబరు 9న ప్రారంభించనున్నారు.

నాలుగున్నర కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్ గుండా భారత్‌కు చెందిన సిక్కు యాత్రికులు పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌కు వెళ్లి పవిత్ర సిక్కు పుణ్యక్షేత్రమైన గురుద్వార సాహిబ్‌ను దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఎలాంటీ వీసా అవసరం లేదని ఇప్పటికే పాకిస్తాన్ ప్రకటించింది. కాగా ఈ కారిడార్‌ పనులను పాకిస్తాన్ ,భారత ప్రభుత్వాలు సంయుక్తంగా గత సంవత్సరం ప్రారంభించాయి. ఇక కారిడార్ సిక్కు గురువైన గురునానక్ జయంతి సంధర్భంగా ప్రారంభించనున్నారు.

Kartarpur Corridor Inaugurated On November 8 by PM Modi

సిక్కు మత వ్యవస్థాపకుడు డేరా బాబా గురు నానక్ దేవ్. ఈయన1469 నవంబర్ 29న పంజాబ్‌లో జన్మించారు. 1539 సెప్టెంబర్ 22న ఆయన మరణించారు. అయితే ఆయన పుట్టిన, మరణించిన స్థలాలు రెండు ఇప్పుడు పాకిస్థాన్‌లోనే ఉన్నాయి. ఆయన జన్మస్థలం లాహోర్‌కు దగ్గర్లోని నాన్ కనా సాహిబ్‌లో ఉంది. అక్కడ ఉన్న గురుద్వారాను గురుద్వారా జనమ్ ఆస్థాన్ అని పిలుస్తారు. గురునానక్ దేవ్ చివరిరోజులను కర్తార్ పూర్‌లోని రావి నది ఒడ్డున గడిపారు. దాదాపు 18 ఏళ్ల పాటు అక్కడే ఉండి పరమపదించారు.దీంతో దాన్ని పవిత్ర స్థలంగా సిక్కులు భావిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+