తీహార్ జైలుకు కార్తీ చిదంబరం, ఇంటి భోజనం, నోచాన్స్, ఐఎన్ఎక్స్ మీడియా ఎఫెక్ట్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు మార్చి 24వ తేదీ వరకు రిమాండ్ కు తరలించాలని ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా ఎఫెక్ట్ తో ఇంటి భోజనంకు చాన్స్ ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది.

  Interim protection to Karti Chidambaram సీబీఐ తనపని తాను చేసుకుపోతుంది
  తీహార్ జైలు

  తీహార్ జైలు

  కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంను సీబీఐ అధికారులు సోమవారం ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. బెయిల్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్న కార్తీ చిదంబరంకు సీబీఐ అధికారులు అవకాశం ఇవ్వడం లేదు.

  ఇంటి భోజనం

  ఇంటి భోజనం

  తీహార్ జైల్లో తనకు ఇంటి భోజనం తినడానికి అవకాశం ఇవ్వాలని కార్తీ చిదంబరం న్యాయమూర్తికి మనవి చేశారు. అయితే తీహార్ జైల్లో ఇంటి భోజనం తినడానికి ఎట్టిపరిస్థితుల్లో అవకాశం ఇవ్వడానికి వీలుకాదని న్యాయమూర్తి చెప్పారు.

  ఐఎన్ఎక్స్ మీడియా

  ఐఎన్ఎక్స్ మీడియా

  కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో అప్పట్లో కేంద్ర మంత్రిగా పని చేసిన చిదంబరం అధికారం అడ్డంపెట్టుకుని కార్తీ చిదంబరం అక్రమాలకు పాల్పడ్డారని, ఐఎన్ఎక్స్ మీడియాకు లాభం చేకూరేలా వ్యవహరించారని సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.

   సీబీఐ, ఈడీ

  సీబీఐ, ఈడీ

  కార్తీ చిదంబరం కారణంగా ప్రభుత్వా ఆదాయానికి నష్టం కలిగిందని, మలేషియా నుంచి రూ. 305 కోట్లకు పైగా ఐఎన్ఎక్స్ మీడియాలో అక్రమంగా పెట్టుబడులు పెట్టారని నమోదు అయిన కేసును సీబీఐతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేస్తోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A special court has remanded Karti Chidambaram to judicial custody till March 24th. This means he will be lodged at the Tihar jail until March 24. The court directed the Tihar jail authorities to provide adequate security to Karti. The court was hearing the INX Media case.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి