జయ పరువు నష్టం కేసు: కోర్టుకు హాజరైన కరుణానిధి
చెన్నై: పరువునష్టం దావా కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి(92) సోమవారం చెన్నైలోని సెషన్స్ కోర్టుకు స్వయంగా హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేసిన పరువునష్టం దావా కేసులో విచారణ నిమిత్తం ఆయన కోర్టుకు వచ్చారు.
ఆయనతో పాటు కుమార్తె కనిమొళి, చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్ ఉన్నారు. కేసును విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. నిరుడు నవంబరు 21వ తేదీన జయలలితకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కరుణానిధి తన పార్టీ పత్రిక ‘మురసొలి'లో ఓ ప్రకటన చేశారు.
Criminal defamation case filed by Tamil Nadu CM: DMK chief Karunanidhi leaves from court after court adjourns case pic.twitter.com/80zWhA1pKX
— ANI (@ANI_news) January 18, 2016 అంతకుముందు ఓ వార పత్రికలో జయలలితను విమర్శిస్తూ ప్రచురితం చేసిన వ్యాసం ఆధారంగా ఆయన ఈ ప్రకటన చేసినట్లు సమాచారం.
కరుణానిధి వ్యాసంతో తన పరువుకు భంగం కలిగిందంటూ జయలలిత చెన్నైలోని సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు కరుణానిధి హాజరు కావాలంటూ కోర్టు సమన్లు పంపింది. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా కోర్టుకు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications