అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన కరుణానిధి, కనిమొళికి బర్త్‌డే శుభాకాంక్షలు

చెన్నై: డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా శుక్రవారం కరుణానిధి ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికవ్వడం ఇద 11వ సారి. పార్టీ ప్రధాని కార్యదర్శి, కోశాధికారులుగా అన్భళగన్, స్టాలిన్‌లు మళ్లీ ఎన్నికయ్యారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ఇక పార్టీ మహిలా విభాగం కార్యదర్శిగా కరుణానిధి కూతురు కనిమొళి ఎన్నికయ్యారు. మాజీ మంత్రులు సుబ్బలక్ష్మీ, జగదీశన్, సద్గుణపాండ్యన్, వీపీ దురైస్వామి, పెరియాస్వాములు పార్టీ డిప్యూటీ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు.

Karunanidhi re-elected as DMK party leader

పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ వయోభారంతో పదవి నుంచి తప్పుకునే యోచనలో ఉన్నారన్న ప్రచారం జరిగినా చివరకు ఆయన్నే ఆ పదవి వరించింది. డా. కళైనార్‌గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.

1969లో సి.ఎన్.అన్నాదురై మరణించినప్పటినుండి నేటి వరకు, తమిళనాడులోని రాజకీయ పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కళగం అధ్యక్షుడు, వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు (1969-71, 1971-74, 1989-91, 1996-2001 మరియు 2006-2011). 60 సంవత్సరాల రాజకీయ జీవి తంలో పోటీచేసిన ప్రతి ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించాడు.

కనిమొళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కరుణ

డీఎంకే పార్టీ ఎంపీ కనిమొళికి ఆమె తండ్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి శుక్రవారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం 47వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కనిమొళికి ఆమె సోదరుడు స్టాలిన్‌తోపాటు డీఎంకే పార్టీ వర్గాలు తమ శుభాబినందనలు తెలియజేశారు.

పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని చెన్నైలోని కనిమొళి నివాసానికి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కనిమొళి మద్దతుదారులు పలు సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+