దొరికిపోయిన విజయ్ ? తొక్కిసలాటకు అదే కారణమైందా ?

తమిళనాడులోని కరూర్ లో నిన్న టీవీకే అధినేత, హీరో విజయ్ నిర్వహించిన రోడ్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆస్పత్రిలో చావుతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ సర్కార్ పై ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలనే ఒత్తిడి పెరుగుతోంది. దీంతో స్టాలిన్ సర్కార్ క్షేత్రస్దాయిలో అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో తొక్కిసలాటకు దారితీసిన ఓ కీలక కారణం బయటపడింది.

తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ కరూర్ ర్యాలీ సందర్భంగా జనం ఊహించని స్దాయిలో తరలివచ్చారు. అసలే విజయ్ చెప్పిన సమయం కంటే దాదాపు నాలుగు గంటలకు పైగా లేటుగా అక్కడికి చేరుకోవడం, భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల భద్రత ప్రమాదంలో పడుతుందని భావించి స్ధానిక అధికారులకు టీవీకే వర్గాలు ఓ కీలక వినతి చేసాయి. ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా విద్యుత్తు నిలివేయాలని వారు కోరారు. ఈ మేరకు అధికారికంగా తమిళనాడు విద్యుత్ బోర్డుకు ఓ లేఖ కూడా ఇచ్చారు. అయితే దీన్ని విద్యుత్ బోర్డు తిరస్కరించింది.

Karur Stampede Vijay s TVK Caught in Chaos After Power Cut Request

విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో మాత్రమే విద్యుత్తును నిలిపివేయాలని లేఖలో అభ్యర్థించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కానీ విజయ్ ప్రసంగంతో సంబధం లేకుండా విద్యుత్ నిలివేయడం కుట్రలో భాగమని టీవీకే వర్గాలు చెప్తున్నాయి. దీంతో అసలేం జరిగిందో తమిళనాడు ప్రభుత్వం ఇవాళ ఫ్యాక్ట్ చెక్ లో వెల్లడించింది. ఇందులో ఆదివారం వేదిక వద్ద విద్యుత్ కోత లేదని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది.

Karur Stampede Vijay s TVK Caught in Chaos After Power Cut Request

విజయ్ ర్యాలీ వేదికకు వచ్చినప్పుడు విద్యుత్ సరఫరా ఆపేశారని టీవీకే చేస్తున్న వాదనలకు కౌంటర్ గా తమిళనాడు ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఎక్స్ లో క్లారిటీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో విద్యుత్ కోత లేదని, టీవీకే పార్టీ విద్యుత్ సరఫరా అంతరాయం కోరినప్పటికీ, అలాంటి విద్యుత్ కోత జరగలేదని వెల్లడించింది. పార్టీ ఏర్పాట్లలో జనరేటర్ సమస్య కారణంగా కొన్ని లైట్లు కాస్త మసకబారాయని తెలిపింది. దీంతోనే తొక్కిసలాట జరిగిందని తేల్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+