కాస్‌గంజ్ హింస: షాపులు దగ్దం, ఆస్తులు ధ్వంసం
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాస్‌గంజ్ జిల్లాలో హింస చెలరేగుతోంది. తాజాగా శనివారంనాడు ఓ గుంపు ఐదు దుకాణాలను దగ్ధం చేశారు. శుక్రవారం ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించిన చందన్ గుప్తా అంత్యక్రియలు పూర్తయిన తర్వాత తిరిగి వస్తూ హింసకు పాల్పడ్డారు.
గణ తంత్రదినోత్సవం సందర్బంగా అనధికారక ర్యాలీ నిర్వహిస్తుండగా శుక్రవారం మత ఘర్షణలు చెలరేగాయి. మితిమీరి ఆస్తులు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ హింస ప్రజ్వరిల్లింది.
సంఘటనకు సంబంధించి తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాస్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనట్లు, ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు ెతిలాపురు.

ఇతర నిందితులను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఛాతీపై బుల్లెట్ తగలడంతో చందన్ గుప్తా అనే 22 ఏళ్ల యువకుడు మరణించాడు. కాలిపై బుల్లెట్ తగిలి గాయపడిన నౌషాద్‌ను అలీగడ్ జిల్లాలోని ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు.
తొలుత ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డాయి. మోటార్ సైకిల్ తిరంగ యాత్రలో పాల్గొన్నవారు ఇస్తున్న కొన్ని నినాదాలను బుదనగర్‌లోని కొందరు వ్యతిరేకించడంతో ఘర్షణ ప్రారంభమైందని పోలీసులు చెప్పారు. తిరగ యాత్రం బిల్రామ్ గేట్ నుంచి ప్రారంభమైంది.
ఓ వర్గానికి చెందిన యువకుడిని మరో వర్గానికి చెందిన వ్యక్తి కొట్టడం కూడా ఘర్షణలకు కారణమని పోలీసులు చెబుతున్నారు. రిజర్వ్ పోలీసు స్టేషన్‌లో గణతంత్ర దినోత్సవాల భద్రత కొసం 16 కిలోమీటర్ల దూరంలో నియోగించిన ఓ బృందాన్ని సంఘటనా స్థలానికి చేరుకుని హింసను అదుపు చేశాయి.
శాంతి సామరస్యాలను కాపాడాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ట్విట్టర్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అల్లరి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications