కాశ్మీర్ పాక్‌లో ఎప్పటికీ భాగం కాదు: ఫరూక్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్ల శుక్రవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రాంతం ఎన్నటికీ పాకిస్థాన్‌లో భాగం కాబోదన్నారు. ఇది అణుబాంబులతో పరిష్కారమయ్యే సమస్య కాదన్నారు.
చర్చల ద్వారా మాత్రమే ముందడుగు వేయగలమని అభిప్రాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌పై చర్చ అనే అంశంపై ప్రముఖ జర్నలిస్టు ఆశిష్‌రాయ్ నేతృత్వంలో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాజీ అధిపతి ఏఎస్ దులత్‌తో శుక్రవారం రాత్రి జరిగిన చర్చాగోష్టిలో ఫరూఖ్ మాట్లాడారు.

ఎన్ని దేశాలు ఎన్ని రకాలుగా ఆశించినా భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో మాత్రం మార్పు ఉండదన్నారు. పాక్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కాశ్మీర్‌ను సాధించలేదన్నారు. ఆకాశం నుంచి ప్రయత్నించినా అది సాధ్యం కాదని అణుదాడిని ఉద్దేశించి అన్నారు.
సరిహద్దుల్లో రెండువైపులా చనిపోతున్నది ముస్లింలేనన్న వాస్తవాన్ని పాకిస్థాన్ ఇంకా ఎందుకు గుర్తించటం లేదని ప్రశ్నించారు. వాళ్లు మాపై బాంబులేస్తారని. అలాగే, మేం వాళ్లపై బాంబులేస్తామని, చివరకు అమాయక ప్రజలు చనిపోతున్నారన్నారు. 65 ఏళ్లుగా ఇదే జరుగుతోందన్నారు. ఇప్పటికైనా ఆపేయాలన్నారు.












Click it and Unblock the Notifications