ఉగ్రదాడితో దేశంలో హైటెన్షన్-ముస్లిం విద్యార్ధులకు బెదిరింపులు..!
కశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో జరిగిన పాకిస్తాన్ ఉగ్రమూకల దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే కాశ్మీర్ కు చెందిన ఓ ముస్లిం గుర్రపు రౌతు, మరో నేపాలీ కూడా చనిపోయారు. అయితే ఈ దాడి తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల్లో జనం, ముఖ్యంగా హిందూ సంస్థలు, గ్రూపుల నుంచి ముస్లిం విద్యార్ధులకు బెదిరింపులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సింగపూర్ కు చెందిన ఛానల్ న్యూస్ ఏషియా కథనాలు ప్రసారం చేసింది.
సింగపూర్‌కు చెందిన ఛానల్ న్యూస్ ఆసియా నివేదిక ప్రకారం, భారతదేశంలోని ఓ కాశ్మీరీ విద్యార్థి సంఘం ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌తో సహా అనేక భారతీయ రాష్ట్రాల్లో విద్యార్ధుల్ని వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని తెలిపింది. జమ్మూ కాశ్మీర్ విద్యార్థుల సంఘం ప్రతినిధి నాసిర్ ఖుహమి మాట్లాడుతూ విద్యార్థులను వారి అద్దె అపార్ట్‌మెంట్‌లు లేదా విశ్వవిద్యాలయ హాస్టళ్లను వదిలి వెళ్ళమని బెదిరిస్తున్నట్లు తెలిపారు. కొన్ని సందర్భాల్లో శారీరకంగా దాడి చేసి ఉగ్రవాదులుగా ఎగతాళి చేస్తున్నట్లు కూడా వెల్లడించారు.

ఛానల్ న్యూస్ ఏషియా కథనం ప్రకారం డెహ్రాడూన్‌లో కాశ్మీరీ ముస్లిం విద్యార్థులు వెంటనే పట్టణం విడిచి వెళ్లాలని లేదా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాలని హిందూ రక్షా దళ్ అనే సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి ఇవాళ ఉధయం 10 గంటల వరకూ డెడ్ లైన్ కూడా పెట్టింది. దీంతో నిన్న దాదాపు 20 మంది విద్యార్థులు పారిపోయారని ఛానల్ తెలిపింది. కశ్మీర్లో ముస్లిం విద్యార్ధులు కూడా ఉత్తరాఖండ్ కు వెళ్లిపోయాలని హెచ్చరికలు చేస్తున్నట్లు వెల్లడించింది.
8th Incident: Second Open Threat Call.
— Nasir Khuehami (ناصر کہویہامی) (@NasirKhuehami) April 24, 2025
Hindutva outfit Hindu Raksha Dal has once again openly issued threats to identify and physically assault Kashmiri Muslim students in Uttarakhand starting today allegedly in retaliation for the tragic killing of tourists in Pahalgam. Members… pic.twitter.com/9x8V3yy7UD
ఈ ఘటనలపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారప.ు విద్యార్థులు సురక్షితంగా లేరనని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలతో తాను సంప్రదిస్తున్నానని తెలిపారు. అలాగే వారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా వ్యాపారులు, విద్యార్థులను కొన్ని శక్తులు బహిరంగంగా బెదిరిస్తుండటంపై జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications