కథువా రేప్: ప్రధాని నిందితుడితోపాటు 8మందిపై ఛార్జీషీటు, అత్యంత పాశవికం

Subscribe to Oneindia Telugu

శ్రీనగర్: కథువాలో అత్యంత పాశవికంగా జరిగిన 8ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో పోలీసులు గురువారం ఛార్జీ షీటు దాఖలు చేశారు. గత జనవరిలో ఓ ఎనిమిదేళ్ల బాలికను అపహరించిన ఆరుగురు దుండుగులు ఓ చిన్న గ్రామంలో వారం రోజులపాటు నిర్బంధించి లైంగికదాడులకు పాల్పడ్డారని తెలిపారు.

చివరికి రాళ్లతో కొట్టి చంపే ముందు మరోసారి ఆమెకు మత్తుమందు ఇచ్చి లైంగికదాడి చేశారని పేర్కొన్నారు. సంచార జాతి(బకర్వాల్ కమ్యూనిటీ)వారిని తరిమివేసేందుకు కొందరు ఈ దారుణాలకు పాల్పడ్డారని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో 8మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు.

ఛార్జీ షీటులో పేర్కొన్న ఆ నిందుతులు 8మందిలో ప్రధాన నిందితుడు సంజిరామ్(60, రిటైర్డ్ రెవెన్యూ అధికారి)తోపాటు సంజిరామ్ మేనల్లుడైన 15ఏళ్ల బాలుడు, దీపక్ ఖజూరియా(ప్రత్యేక అధికారి), పర్వేశ్ కుమార్(సంజిరామ్ మేనల్లుడి స్నేహితుడు), విశాల్ జంగోత్రా, తిలక్ రాజ్(హెడ్ కానిస్టేబుల్), ఆనంద్ దుత్తా(సబ్ ఇన్‌స్పెక్టర్), సురీందర్ కుమార్(ప్రత్యేక పోలీసు అధికారి) ఉన్నారు.

Kathua rape: The charges and the role played by the 8 accused

బెదిరింపులకు గురిచేస్తున్నారు: బాధితురాలి తరపు న్యాయవాది

అత్యాచార బాధితురాలి తరపున న్యాయం కోసం పోరాడుతుంటే తోటి న్యాయవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని లాయర్‌ దీపికా సింగ్‌ రాజవత్‌ చెప్పారు.
కథువా రేప్ కేసులో బాధిత బాలిక తల్లిదండ్రుల పక్షాన జమ్మూ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్న దీపిక.. జమ్మూ బార్ అసోసియేషన్‌పై సంచలన వాఖ్యలు చేశారు.

'ఈ కేసులో బాధితుల తరపున నిలబడ్డ క్షణం నుంచి అనేక రకాల బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఎన్ని హెచ్చరికలు వచ్చినా న్యాయం కోసం వాటిని పట్టించుకోను. హైకోర్టులో తోటి న్యాయవాదులే నన్ను దూషిస్తున్నారు. 8 ఏళ్ల బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపేస్తే అక్కడ స్థానిక లాయర్లు కేసు నమోదు కాకుండా నిందింతులకు సహాయం చేశారు. దీని వెనుక వారి ఉద్దేశం అర్థవవుతుంది' అని చెప్పారు.

'జమ్మూ బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు బీఎస్‌ సలాథియా నన్ను ఈ కేసు వాదించవద్దన్నారు. ఒకవేళ నువ్వు వాదిస్తే నిన్ను ఎలా అడ్డుకోవాలో తెలుసని ఆయన బెదిరించారు. భయంతో నేను భద్రత కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించానని.. వారు తనకు రక్షణ కల్పించాలని పోలీసు శాఖను ఆదేశించారు' అని దీపిక తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణ పట్ల బాలిక తల్లిదండ్రులు సంతృప్తిగా ఉన్నారని, అలాంటప్పుడు సీబీఐ దర్యాప్తు అవసరం ఏముందని దీపిక ప్రశ్నించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Kathua rape and murder was a gruesome act in which an 8 year lost her life. The Jammu police have filed its chargesheet in the case and details the most horrific crime one has seen in recent times.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి