కథువా రేప్: ఒకేరోజు 8 భంగ్ మాత్రలు, వెలుగులోకి మరిన్ని సంచలనాలు

Subscribe to Oneindia Telugu
  వెలుగులోకి మరిన్ని సంచలనాలు....!

  జమ్మూకశ్మీర్: కథువా చిన్నారిపై గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. బాధితురాలిపై అత్యాచారం జరిపిన క్రమంలో.. నిందితులు ఆమె పట్ల వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని మరోసారి వెల్లడైంది.

  కథువా రేప్: చిట్టితల్లి హత్యాచారం వెనుక కొన్ని కఠిన నిజాలు

  అత్యాచారానికి ముందు నిందితులు బాలికకు 'భంగ్' మాత్రలను బలవంతంగా తినిపించారని కథువా క్రైం బ్రాంచ్ పోలీసులు తేల్చారు. ఆ సమయంలో ఓ యువకుడు బాలిక కాళ్లు గట్టిగా పట్టుకోగా.. మరొకరు ఆమె నోట్లో మూడు భంగ్ మాత్రలను వేసినట్టు తెలిపారు.

   ఒకేరోజు 8మాత్రలు..

  ఒకేరోజు 8మాత్రలు..

  బాలికను దేవాలయంలో బంధించిన దుండగులు.. మూడు రోజుల పాటు ఎపిట్రిల్ 0.5 ఎంజీ మత్తు బిళ్లలను మింగించారని చెప్పారు. 'మేం డాక్టర్లతో మాట్లాడినప్పుడు వారు చెప్పారు.. సాధారణంగా పేషెంట్లకు 0.5ఎంజీ డోస్ మాత్రను రోజుకు ఒకటే ఇస్తారని తెలిపారు. కానీ కథువా బాలికకు మాత్రం ఒకేరోజు అలాంటివి 8మాత్రలు మూడు రోజుల పాటు మింగించారు' అని పోలీసులు తెలిపారు.

   చిన్నారి తల్లిదండ్రులను రానివ్వలేదు..

  చిన్నారి తల్లిదండ్రులను రానివ్వలేదు..

  బాలికను దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో బాలిక ఆచూకీ కోసం ఓరోజు ఆమె తల్లిదండ్రులు ఆలయం గేటు వద్దకు రాగా.. వారిని లోపలికి రానివ్వలేదని పోలీసులు తెలిపారు.

   సాంజీ రామ్ ప్రధాన సూత్రధారి?

  సాంజీ రామ్ ప్రధాన సూత్రధారి?

  'అక్కడి వాతావరణం అత్యంత చల్లగా ఉండటంతో బాలిక మృతదేహం మూడు రోజుల పాటు కుళ్లిపోకుండా ఉంది' అని చెప్పారు. ఈ మొత్తం ఘటన వెనుక రెవెన్యూ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ సాంజీ రామ్ ప్రధాన సూత్రధారి అని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

  అడవిలో క్రూర జంతువులు, కోతుల భయంతోనే బాలిక మృతదేహాన్ని సాంజీ రామ్ ఇంటికి 100మీ. దూరంలోనే పడేశారని పోలీసులు తెలిపారు.

  సాంజీరామ్ కొడుకు కూడా?

  సాంజీరామ్ కొడుకు కూడా?

  గ్యాంగ్ రేప్ ఘటనలో సాంజీ రామ్ 22ఏళ్ల కొడుకు కూడా నిందితుడేనని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటన సమయంలో అతను మీరట్ యూనిర్శిటీలో పరీక్షకు హాజరైనట్టు అటెండెన్స్ షీట్ చూపించారని, కానీ అందులో నిజం లేదని అన్నారు.

  నిందితుడి అసలు సంతకంతో అటెండెన్స్ షీట్ సంతకం సరిపోలలేదని ఫోరెన్సిక్ టీమ్ కూడా ధ్రువీకరించింది.

  పాకిస్తాన్ హస్తం ఉందన్న బీజేపీ నేత:

  పాకిస్తాన్ హస్తం ఉందన్న బీజేపీ నేత:

  బీజేపీ మధ్యప్రదేశ్ చీఫ్ నందకుమార్ సింగ్ చౌహాన్ కథువా అత్యాచార ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన వెనుక పాకిస్తాన్ ఉందని ఆరోపించారు. ఈ సంఘటనను అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ భారత్‌లో అల్లర్లను రెచ్చగొట్టడానికి ప్రయత్నించిందన్నారు.

  కశ్మీర్ లో హిందువుల జనాభా కేవలం ఒక శాతమే అని, వారు కనీసం నోరు కూడా విప్పరని, అలాంటిది నిందితులను విడుదల చేయాలని వారు నినాదాలు చేశారన్న వాదనలో నిజం లేదని అన్నారు. అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు.

  ఇలాంటి చర్యలను అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ ఏజెంట్లు భారత్ విషయాల్లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The only resistance that an eight-year-old allegedly gang-raped and killed in Kathua offered was in her first few moments of captivity before the 15-year-old accused allegedly forced three pills of bhang (an edible preparation from cannabis) down her throat, while his friend held her legs firmly, police officials said.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి