వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అబ్బాయిలనే ఇంట్లో కూర్చోబెట్టండి: వేధింపుల ఘటనపై కిరణ్ ఖేర్ తీవ్ర స్పందన

|
Google Oneindia TeluguNews

చండీగఢ్‌: హర్యానా ఘటనపై అలనాటి నటి, బీజేపీ ఎంపీ కిరణ్‌ ఖేర్‌ తీవ్రంగా స్పందించారు. ఇంట్లో కుర్చోపెట్టాల్సింది అమ్మాయిలను కాదని అబ్బాయిలనని స్పష్టం చేశారు. హర్యానాలో ఓ ఐఏఎస్‌ అధికారి కుమార్తెను బీజేపీ నేత సుభాష్‌ బరాలా కుమారుడు వికాస్‌ బరాలా వేధించిన ఘటన తెలిసిందే.

ఈ కేసు విషయమై బాధితురాలు వర్ణిక గురించి ప్రస్తావిస్తూ.. 'తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారిని రాత్రిళ్లు బయటికి పంపకూడదు. అయినా వారికి రాత్రిళ్లు బయట ఏం పని?' అని మరో బీజేపీ ఎంపీ రాంవీర్‌ భట్టి వ్యాఖ్యానించారు. దీనిపై కిరణ్‌ ఖేర్‌ కాస్త ఘాటుగా స్పందించారు.

Keep Boys At Home, Not Girls: Kirron Kher On Chandigarh Stalking

'ఓ అమ్మాయి గురించి ఇలా మాట్లాడటానికి రాంవీర్‌కి నోరెలా వచ్చింది. ఆయన్ని పార్టీ కొలీగ్‌ అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది' అని కిరణ్‌ తీవ్రంగా మండిపడ్డారు.
'రాత్రి వేళలే ఎందుకు డేంజర్‌గా ఉంటున్నాయి? పగలు ఎందుకు ఉండడంలేదు. ముందు ఇంట్లో కూర్చోపెట్టాల్సింది అబ్బాయిల్ని. అమ్మాయిల్ని కాదు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాంవీర్‌ వ్యాఖ్యలకు బాధితురాలు వర్ణిక కూడా ధీటుగా సమాధానం ఇచ్చింది. తాను ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా అది ఇతరులకు అనవసరమని తాను బాధితురాలే కానీ నిందితురాల్ని కానని ఘాటుగా సమాధానమిచ్చింది. కాగా, పోలీసులు ఈ కేసులో ఐదు సీసీ కెమెరాల ఫుటేజీ తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

English summary
Kirron Kher, the BJP legislator from Chandigarh, delivered a scathing criticism of fellow BJP man Ramveer Bhatti, saying she was "embarrassed" to be called his party colleague.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X