100 మంది విశ్వ మేధావుల్లో కేజ్రీవాల్, 32వ స్థానం
వాషింగ్టన్: ప్రపంచ మేధావుల జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఎఎపి) వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్‌కు చోటు దక్కింది. '100 గ్లోబల్ థింకర్స్ ఆఫ్ 2013' జాబితాలో కేజ్రీవాల్‌కు 32వ స్థానం దక్కింది. అమెరికా నిఘా సంస్థల గుట్టును రట్టు చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఈ జాబితాలో అగ్రభాగాన నిలిచాడు.
ఉద్యమకారులు ఊర్వశి బుటాలియా, కవితా కృష్ణన్‌తో పాటు ఆనంద్ గ్రోవర్, రోహిత్ వాంఛూ, సంజయ్ బసు, నావల్ రవికాంత్భారతీయులకు ఈ జాబితాలో స్థానం లభించింది.

గణనీయమైన వైవిధ్యాన్ని చూపిన వారికి చోటు కల్పించిన ఈ జాబితాలో కేజ్రీవాల్ 32వ స్థానంలో నిలవడం గమనార్హం. భారత రాజధానిలో అవినీతిని ప్రక్షాళన చేసే ఉద్యమానికి నేతృత్వం వహించినందుకు జాబితాలో చోటు కల్పించనట్లు పత్రిక పేర్కొంది. ఢిల్లీలో అవినీతిని తొలగించేందుకు, పౌరుల అవసరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టేలా చేసే ప్రభావవంతమైన ఉధ్యమాన్ని చేపట్టారని పేర్కొంది.
బుటాలియా, కృష్ణన్‌లు ఈ జాబితాలో 77వ స్థానంలో నిలిచారు. వీరు భారత్‌లో లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాటంలో అగ్రస్థానంలో నిలిచారని పత్రిక పేర్కొంది. ఈ జాబితాలో ఆమెరికా విదేశాంక మంత్రి జాన్ కెర్రీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్‌రోవ్, జపాన్ ప్రధాని షింజో అంబె, ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రౌహానీ, పోప్ ఫ్రాన్సిస్, ఫేస్‌బుక్ వ్యవస్థాపకులు జుకర్ బర్గ్, ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ నవీ పిళ్లై తదితరులు ఉన్నారు.