వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంబానీ ముడుపులు చెల్లించారేమో..! అందుకే అలా.. : కేజ్రీవాల్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికల సమయంలో ఢిల్లీ ప్రజలకు హామి ఇచ్చిన సీఎం కేజ్రీవాల్ ఆచరణలో మాత్రం కష్టాలను ఎదుర్కోక తప్పట్లేదు. ఎన్నికల సమయంలో కరెంటు బిల్లులు కట్టవద్దంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఆయన, అధికారంలోకి వచ్చి రెండేళ్లకు దగ్గరవుతున్నా..! ఇప్పటికీ కరెంట్ ఛార్జీలను తగ్గించలేకపోయారు.

అయితే, విద్యుత్ ఛార్జీల హామీల విషయంలో తమ వైఫల్యం ఏమి లేదని, అనిల్ అంబానీకి చెందిన అనిల్ ధీరుబాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) వైఖరి వల్లే విద్యుత్ ఛార్జీల తగ్గింపు కుదరట్లేదని ఆరోపిస్తున్నారు కేజ్రీవాల్. ఈ విషయంలో అంబానీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన కేజ్రీవాల్, కరెంట్ ఛార్జీలు తగ్గించకుండా ఉండేందుకు అంబానీ ముడుపులు చెల్లించి ఉంటారని ఆరోపించారు.

Kejriwal controversial comments on ambani

అంబానీకి చెందిన విద్యుత్ సంస్థ బీఎస్ఈఎస్ పనితీరు ఏమాత్రం బాగా లేదని, ప్రభుత్వాన్ని వేధించేదిగా
సదరు సంస్థ వ్యవహారం తయారైందని మండిపడ్డారు కేజ్రీవాల్. కాగా, విద్యుత్ ఛార్జీల విషయంలో చర్చలకు రావాల్సిందిగా అంబానీని ఆహ్వానించింది ఢిల్లీ సర్కార్. ఈ చర్చలపైనే ఢిల్లీలో విద్యుత్ ఛార్జీలు తగ్గేది లేనిది ఆధారపడి ఉంది.

English summary
Delhi cm Aravind Kejriwal made some controversial comments on Anil ambani. Kejriwals election promise of reducing power charges is till now not in action, for this kejriwal alleged ambani
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X