అలా అయితే గెలిచే స్థానం: మోడీపై కేజ్రీ పోటీ (పిక్చర్స్)
వారణాసి/న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పైన పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. మంగళవారం నాటి ఆయన వారణాసి పర్యటన కొంత ఉద్రిక్తంగా మారింది. ఆయనకు అక్కడ గుడ్లతో స్వాగతం పలికారు. ఆయనకు మిశ్రమ స్పందన లభించింది.
వారణాసి వచ్చిన కేజ్రీవాల్‌కు మోడీ మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కోడిగుడ్లుతో దాడి చేశారు. సిరా చల్లి నిరసన తెలిపారు. న్యూఢిల్లీ నుంచి రైలులో వారణాసి చేరుకున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ‘నేను బెనారస్ చూడాలని రాలేదు. మోడీని ఓడించాలన్న లక్ష్యంతోనే వచ్చాను' అని చెప్పారు. మోడీకి వ్యతిరేకంగా పోరాడం పెద్ద విషయం కాదని ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో స్పష్టం చేశారు.
తన దృష్టిలో అవినీతి నుంచి దేశాన్ని రక్షించడమే పెద్ద సమస్య అన్నారు. కాశీ విశ్వనాథ్ ఆలయం వెలుపల కేజ్రీవాల్ కారుపై మోడీ అనుచరులు కోడిగుడ్లు విసిరారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చిన ఆందోళన కారులు తక్షణం హిందువుల పవిత్ర స్థలం నుంచి వెనక్కువెళ్ళాలని డిమాండ్ చేశారు. ఆయనపై సిరా వేశారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు చాలా శ్రమపడాల్సి వచ్చింది.
బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఒక్కరే వారణాసి నుంచి పోటీ చేయాలి తప్ప మరొకరు బరిలో ఉండడానికి వీల్లేదని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ గందరోళ పరిస్థితులు మధ్యే ఆప్ అధినేత కేజ్రీవాల్ టాప్‌లేని జీపులో ర్యాలీగా వెళ్తుండగా ఆయనపై ఇంకు చల్లారు. కేజ్రీవాల్ దుస్తులు, ముఖంపై సిరా పడింది. ఆయన పక్కనే ఉన్న ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లపైనా సిరా పడింది.
సిరా చల్చిన వ్యక్తి హిందూ వాహిని సేనకు చెందిన అంబరీష్‌గా గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ ర్యాలీ సాగుతున్నంత సేపూ నల్లబ్యాడ్జీలతో నిరసనలు, ఆప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తునే ఉన్నారు. తొలుత కేజ్రీవాల్ పవిత్ర గంగానదిలో స్నానమాచరించారు.
కాగా, తాను వారణాసి నుండి పోటీ చేస్తున్నానని చెప్పారు. తాను మార్పు కోసమే వచ్చానని, అధికారం, గెలుపే లక్ష్యమైతే గెలువగలిగే స్థానాన్ని చూసుకునే వాడినని చెప్పారు. మరోవైపు, నరేంద్ర మోడీ బరిలో దిగనున్న రెండోస్థానం వదోదర నుంచి రాహుల్ గాంధీ అనుచరుడు మధుసూదన్ మిస్త్రీ పోటీ చేయనున్నారు.

వారణాసి
బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఒక్కరే వారణాసి నుంచి పోటీ
చేయాలి తప్ప మరొకరు బరిలో ఉండడానికి వీల్లేదని
కొందరు ఆందోళనకారులు
డిమాండ్ చేశారు.

వారణాసి
ఈ గందరోళ పరిస్థితులు
మధ్యే ఆప్ అధినేత
కేజ్రీవాల్ టాప్‌లేని
జీపులో ర్యాలీగా
వెళ్తుండగా ఆయనపై ఇంకు
చల్లారు. కేజ్రీవాల్
దుస్తులు, ముఖంపై సిరా
పడింది.

వారణాసి
ఆయన పక్కనే ఉన్న ఆప్ నేతలు
మనీష్ సిసోడియా, సంజయ్
సింగ్‌లపైనా సిరా పడింది.
సిరా చల్చిన వ్యక్తి హిందూ
వాహిని సేనకు చెందిన
అంబరీష్‌గా గుర్తించారు.

వారణాసి
అప్రమత్తమైన పోలీసులు
అతడిని అదుపులోకి
తీసుకున్నారు. కేజ్రీవాల్
ర్యాలీ సాగుతున్నంత సేపూ
నల్లబ్యాడ్జీలతో నిరసనలు,
ఆప్‌కు వ్యతిరేకంగా
నినాదాలు చేస్తునే
ఉన్నారు.

వారణాసి
అంతకుముందు ఆమ్ ఆద్మీ
పార్టీ సమన్వయకర్త, ఢిల్లీ
మాజీ ముఖ్యమంత్రి అరవింద్
కేజ్రీవాల్ పవిత్ర
గంగానదిలో
స్నానమాచరించారు.












Click it and Unblock the Notifications