వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ పండిట్ల పేరుతో కోట్లు కొల్లగొడుతున్నారు.. అరవింద్ కేజ్రీవాల్ హాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

కశ్మీర్ పండిట్ల వెతలతో కశ్మీర్ ఫైల్స్ మూవీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ వల్లే రాధేశ్యామ్ పత్తా లేకుండా పోయింది. అయితే ఈ చిత్రం.. బీజేపీ కావాలనే విడుదల చేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలా మాట్లాడగా.. ఇవాళ ఆప్ ఛీప్ అరవింద్ కేజ్రీవాల్ వంతు వచ్చింది.

'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం రాజకీయ దుమారం రేపుతోంది. 1990లో జమ్మూ కశ్మీర్‌లో పండిట్లపై జరిగిన ఘాతుకాలను ఇందులో చూపించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా 13 రోజుల్లోనే రూ.200 కోట్లు వసూల్ చేసింది. ఢిల్లీ అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. కశ్మీరీ పండిట్ల పేరుతో కొందరు వ్యక్తులు కోట్లు కొల్లగొడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలేమో పోస్టర్లు అంటించే పనిలో పడ్డారని కామెంట్ చేశారు.

kejriwal made hot comments on kashmir files movie

అగ్నిహోత్రి కశ్మీరీ పండిట్ల పేరు చెప్పుకుని కోట్లు సంపాదించాడు. బీజేపీ నేతలు ఈ సినిమా ద్వారా చక్కగా ప్రచారం చేసుకుంటున్నారు. ఏంచేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి. ఇకనైనా కళ్లు తెరవండి అంటూ కేజ్రీవాల్ హితవు పలికారు. ఇటీవల హర్యానాలో 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించడం నిలిపివేయాలని ఓ బీజేపీ నేతను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కోరుతూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కానీ బీజేపీ లక్ష్యంగానే విమర్శలు చేశారు.

ఈ చిత్రానికి బీహార్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, హర్యానా, త్రిపుర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వినోద పన్ను మినహాయించారు. సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. కానీ బీజేపీ రాజకీయంగా వాడుకుంటుందని.. మిగతా పక్షాలు అంటున్నాయి. ఆ మేరకు తిప్పికొడుతున్నాయి. కానీ సినిమాను స్టడీ తీశానని.. ఏదీ కల్పితం కాదని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అంటున్నారు. అందుకే జనం నీరాజనం పడుతున్నారు. కానీ కేసీఆర్, కేజ్రీవాల్ మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు.

English summary
aap chief arvind kejriwal made hot comments on kashmir files movie. someone take kashmir pandit subject and profit crores of rupees
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X