వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూ ఢిల్లీలో కేజ్రీవాల్‌తో ఢీ: ఎవరీ నూపుర్ శర్మ?

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై బిజెపి ఒక మహిళను పోటీకి దించనుంది. ఆమె పేరు నూపుర్ శర్మ. నూపుర్ శర్మ గతంలో ఆమె భారతీయ జనతా యువ మోర్చా సభ్యురాలుగా ఉన్నారు. ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు తన వంతు గట్టి పోటీ ఇవ్వగలననుకుంటున్నానని నూపుర్ శర్మ చెప్పారు. ఎన్నికల్లో విజయం సాధిస్తానని కూడా ఆశిస్తున్నానని అన్నారు.

తాను ఢిల్లీ ప్రాంతవాసిని అని, ఈ ఎన్నిక పార్టీకి సంబంధించినదని ఆమె అన్నారు. ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గతంలో ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో పోటీ చేసిన శర్మ యూనియన్‌కు అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. ఈమె వృత్తి రీత్యా న్యాయవాదిగా పని చేస్తున్నారు. న్యూఢిల్లీ శానససభా నియోజకవర్గంలో ఆమె కేజ్రీవాల్‌ను ఢీకొట్టేందుకు సిద్ధపడ్డారు.

 Kejriwal's Rival, a London School of Economics Graduate

పోటీ ఏదైనా గెలవడానికే చేస్తామని 30 ఏళ్ల నూపుర్ శర్మ అంటున్నారు. కేజ్రీవాల్‌పై పోటీ దిగడం ద్వారా బలిపశువును కాబోనని ఆమె అన్నారు. బిజెపి గత రాత్రి విడుదల చేసిన 62 మందితో కూడిన జాబితాలో ఇద్దరిపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. ఒకరు కిరణ్ బేడీ కాగా, రెండో అభ్యర్థి నూపుర్ శర్మ. కృష్ణానగర్ నుంచి పోటీ చేస్తున్న కిరణ్ బేడీ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేజ్రీవాల్‌ను ఢీకొంటున్నారు.

ప్రజలు ఎవరు పనిచేస్తారనే దిశలో ఆలోచిస్తున్నారని నూపుర్ శర్మ అన్నారు. పనిచేయాలనుకునేవారు పారిపోరని ఆమె అన్నారు.

English summary
Arvind Kejriwal's rival in next month's Delhi election is a London School of Economics graduate who fought her last election in college. Nupur Sharma, 30, the BJP's candidate in the New Delhi assembly seat, says "this will be an election being fought to be won."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X