Delhi Assembly Election 2025: ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సంచలన లేఖ

బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విరుచుకుపడ్డారు. బిలియనీర్లు తీసుకున్న రుణాలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేస్తోందని.. మరోవైపు సాధారణ ప్రజలపై అధిక పన్ను భారాన్ని మోపుతోందని తీవ్ర విమర్శలు చేశారు. ధనికులు తీసుకున్న రుణాలను మాఫీ చేయకుండా ఒక చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు కేజ్రీవాల్.

"కేంద్ర ప్రభుత్వం బిలియనీర్లకు అనుకూలంగా పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ధనికులకు వేలకోట్ల కార్పొరేట్ లోన్స్ ను మాఫీ చేస్తోంది. ఇలాంటి చర్యల వల్ల సాధారణ ప్రజలపై పన్నుల భారం అధికమవుతోంది. సాధారణ ప్రజలు తమ జీతాల్లో సగం డబ్బును టాక్స్ రూపంలో కడుతున్నారు. మరి మోదీ సర్కార్ పేదలు తీసుకున్న లోన్ లను ఎందుకు మాఫీ చేయదు. ప్రజల హోం లోన్, కార్ లోన్ లను మాఫీ చేయోచ్చు కదా..?" అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. బిలియనీర్లకు లోన్ మాఫీ చేయడాన్ని తక్షణమే ఆపేయాలని, నిత్యావసరాలపై జీఎస్టీ రేట్లను పూర్తిగా నిర్మూలించాలని అన్నారు.

Kejriwal Slams Centre for Waiving Loans of Billionaires Demands Equal Treatment for Common People

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల సొమ్మును ప్రజల కోసమే ఖర్చు చేస్తోందని.. కానీ బీజేపీ మాత్రం వాళ్ల స్నేహితులకోసం ఖర్చు చేస్తుందని మండిపడ్డారు. దిల్లీ ప్రజలకు విద్య, వైద్యం, ఫ్రీ బస్, ఫ్రీ విద్యుత్, తాగునీటి సరఫరా.. అన్నీ ఇచ్చామన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న 20 రాష్ట్రాల్లో పవర్ కట్స్ ఉన్నాయన్నారు. చీపురు గుర్తుకు ఓటేస్తే 24 గంటలు విద్యుత్ ఉంటుందని.. కమలానికి ఓటేస్తే కనీసం 6 గంటలు పవర్ కట్స్ ఉంటాయని కేజ్రీవాల్ తెలిపారు.

దిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. దిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడనున్నాయి. ఆప్ వరుసగా మూడోసారి అధికారం చేజిక్కుంచుకోవాలని శ్రమిస్తోంది. అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+