ఒక్కటిచ్చాడు!: కేజ్రీవాల్ పైన దాడి, చితకబాదిన ఎఎపి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి పైన శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆయనపై ఒక్కటిచ్చాడు. పోలీసులు ఈ ఘటనకు పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల మేరకు... న్యూఢిల్లీలోని దక్షిణపురిలో కేజ్రీవాల్ రోడ్డుషో నిర్వహిస్తున్నారు.
అతను ఓపెన్ జీపులో ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో వెనుక నుండి వచ్చిన ఓ అగంతకుడు కేజ్రీవాల్ పైన దాడికి యత్నించాడు. కేజ్రీవాల్ మెడ పైన దెబ్బ వేసినట్లుగా తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన ఎఎపి కార్యకర్తలు అతనిని చితకబాది, పోలీసులకు అప్పగించారు.

కాగా, తన పైన దాడికి పాల్పడిన వ్యక్తిని ఎఎపి కార్యకర్తలు చితకబాదే సమయంలో... ఎదురు దాడికి పాల్పడవద్దని, అతనిని పోలీసులకు అప్పగించాలని కేజ్రీవాల్ సూచించారు. పలువురు కార్యకర్తలు అతనిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు.
కాగా, కేజ్రీవాల్ పైన దాడికి యత్నించిన వ్యక్తిని భారతీయ జనతా పార్టీ పంపించిందని ఎఎపి ఆరోపిస్తోంది. కాగా, కేజ్రీవాల్ పైన దాడికి ఇదే మొదటిసారి కాదు. మార్చి 28న అన్నాహజారే మద్దతుదారుగా చెప్పుకున్న ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. వారణాసిలోను కేజ్రీవాల్ పైన నల్లటి ఇంకుతో దాడి చేశారు.












Click it and Unblock the Notifications