మోడీకి షాక్!: కేజ్రీవాల్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు, లెఫ్టినెంట్‌పై ఆగ్రహం
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో సోమవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఇష్టానుసారంగా వ్యవహరించరాదని హైకోర్టు చెప్పింది. ఏసీబీ అధికారులు ఢిల్లీ ప్రభుత్వ అదేశాలనే పాటించాలని ఆదేశించింది.
ఏసీబీ ఆధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు పాటించవద్దని చెప్పింది. ప్రజలు అధికారం ఇచ్చిన పార్టీని లెఫ్టినెంట్ గవర్నర్ హితవు పలికింది. ఏసీబీ అధికారులకు పోలీసులను అరెస్టు చేసే అధికారం ఉందని చెప్పింది.
హైకోర్టు తీర్పు పైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని బలహీనపర్చాలన్న కేంద్రం యత్నాలకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు అన్నారు.

కాగా, కేజ్రీవాల్, లెప్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లెప్టెనెంట్ గవర్నర్‌గా నజీబ్ జంగ్‌కున్న విశిష్ట అధికారాలను కేంద్రం ఇటీవల ప్రకటించింది. అధికారులను పోస్టింగ్ చేయడం, బదిలీలు, తొలగింపు వంటి అధికారాలు గవర్నర్‌కు ఉన్నాయని, ఈ విషయంలో మందస్తు సమాచారాన్ని ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
దీనికి సంబంధించి లెప్టినెంట్ గవర్నర్ అధికారాలను తెలుపుతూ గెటిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్‌లను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాలు, శాంతి భద్రతలు, పోలీస్, భూములు తదితర విషయాలు ఆయన పరిధిలోకే వస్తాయని స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛగా పనిచేయకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ఆటంకాలు కల్పిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. అనంతరం కేజ్రీవాల్ కోర్టుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications