వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీని కలిసిన ఇన్పోసిస్ నారాయణ మూర్తి, ఆప్‌లో చేరతారా..?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇన్పోసిస్ వ్వవస్ధాపక ఛైర్మన్ నారాయణ మూర్తి రాజకీయాల్లోకి వస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు. మూర్తి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్‌లోకి చేరుతున్నారనే ఊహాగానాలు దేశరాజధానిలో ఢిల్లీలో వినిపిస్తున్నాయి. గత మంగళవారం నారాయణమూర్తి ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో భేటీ అయ్యారు.

కేజ్రీవాల్ ఆపాయింట్‌మెంట్ కోసం స్వయంగా నారాయణ మూర్తినే ఫోన్ చేశారని తెలుస్తోంది. నారాయణ మూర్తి అనుభవాన్ని పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల్లో ఉపయోగించుకోవడానికి కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం తప్పనిసరి చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో నేను నిర్వహించే స్వచ్ఛంద సంస్థ అక్షయపాత్ర గురించి వివరించడానికి కేజ్రీవాల్‌ను కలిశాను.

Kejriwal Wants Narayana Murthy To Join AAP?

అంతే తప్ప ఆప్ నేతలను కలవడం వెనుక ఎలాంటి కారణాలు లేవని నారాయణమూర్తి ఈ-మెయిల్ ద్వారా మీడియాకు తెలిపారు. ఇటీవల బెంగుళూరు పర్యటనలో అక్షయపాత్ర సంస్థను సందర్శించిన సమయంలో నారాయణ మూర్తితో కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు.

కేజ్రీవాల్‌ను నారాయణమూర్తి మర్యాదపూర్వకంగానే కలిశారని, పలు సమాజిక అంశాలు, సమస్యలపై చర్చించారని ఇన్ఫోసిస్ ప్రతినిధి ఆదర్శ్‌ శాస్త్రి పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ బాలకృష్ణన్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు నుంచి పోటీ చేసిన ఓడిపోయిన విషయం తెలిసిందే.

English summary
Aam Aadmi chief Arvind Kejriwal is making attempts to rope in former Infosys director NR Narayana Murthy to improve his image in the wake of infighting within the party. Reports said that Murthy is leaning closer to AAP and may even join its ranks. The Infosys founder had met Kejriwal and Manish Sisodia at the Delhi CM's office on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X