వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Kerala Exit Poll Results 2021 : హోరాహోరీలో లెఫ్ట్‌దే పైచేయి- రిపబ్లిక్‌ టీవీ

|
Google Oneindia TeluguNews

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రిపబ్లిక్ టీవీ-సీఎన్‌ఎక్స్‌ ఎగ్జిట్ పోల్‌ అంచనాలు వెలువడ్జాయి. కేరళ అసెంబ్లీకి హోరాహోరీగా సాగి పోరులో సీఎం పినరయి విజయన్‌ నేతృత్వంలోని లెఫ్ట్‌ డెమోక్రాటిక్ ఫ్రంట్‌ ఆధిక్యం కనబరిచే అవకాశాలున్నట్లు రిపబ్లిక్ టీవీ-సీఎన్‌ఎక్స్‌ ఎగ్జిట్ పోల్‌ అంచనా వేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌ రెండో స్ధానానికి పరిమితం కానుంది.

కేరళ అసెంబ్లీలో మొత్తం 140 సీట్లు ఉన్నాయి. ఇందులో ఎల్‌డీఎఫ్‌ కూటమికి 72 నుంచి 80 స్ధానాలు రావొచ్చని రిపబ్లిక్ టీవీ-సీఎన్‌ఎక్స్‌ ఎగ్జిట్ పోల్‌ అంచనా వేసింది. ఆ తర్వాత స్ధానంలో ఉన్న యూడీఎఫ్‌కు 58 నుంచి 64 సీట్లు దక్కొచ్చని రిపబ్లిక్ టీవీ-సీఎన్‌ఎక్స్‌ ఎగ్జిట్ పోల్‌ తెలిపింది. ఎన్డీయేకు కేవలం 1 నుంచి 5 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు ఈ ఎగ్జిట్‌ పోల్‌ పేర్కొంది. అంటే మరోసారి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్టీఎఫ్ కూటమి అధికారం చేజిక్కించుకోవడం ఖాయమైంది.

Kerala Exit Poll Results 2021 : Republic tv-CNX Predicts LDF edge over UDF

రిపబ్లిక్ టీవీ-సీఎన్‌ఎక్స్‌ ఎగ్జిట్ పోల్‌ ప్రకారం చూస్తే ఐదేళ్లకోసారి కొత్త కూటమికి అధికారాన్ని అప్పగించే సంప్రదాయం ఉన్న కేరళలో పినరయి విజయన్‌ సర్కారు అధికారం నిలబెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. గత ఐదేళ్లలో విజయన్ సర్కారు పలు సంక్షోభాలు ఎదుర్కొన్నా అంతిమంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోలేదని తాజా అంచనాలు నిరూపిస్తున్నాయి. అయితే అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి ప్రజల్లో బలం పెరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ పెద్దలు ఎంత కష్టపడినా ఎన్డీయేకు మాత్రం గరిష్టంగా ఐదు సీట్లు దాటడం లేదు.

ldf 72-80
udf 58-64
nda 1-5

English summary
republic tv-cnx exit polls predictions shows that pinarai vijayan led left democratic front may gain highest seats in kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X