షాక్: నెలరోజులుగా శవంతోనే భార్య, కొడుకు, ఎక్కడంటే?
నెలరోజుల క్రితం చనిపోయిన 50 ఏళ్ళ వృద్దుడి శవంతోనే ఓ కుటుంబం అదే ఇంట్లో నివాసం ఉంటుంది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని మలప్పురంలో చోటుచేసుకొంది.
మలప్పురం: నెలరోజుల క్రితం చనిపోయిన 50 ఏళ్ళ వృద్దుడి శవంతోనే ఓ కుటుంబం అదే ఇంట్లో నివాసం ఉంటుంది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని మలప్పురంలో చోటుచేసుకొంది.
పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న 50 ఏళ్ళ సయ్యద్ అనే వ్యక్తి మృతదేహం వద్ద ఆయన భార్య, 21 ఏళ్ళ కొడుకు మృతదేహం పక్కనే ఉండడాన్ని పోలీసులు గుర్తించారు.

చనిపోయిన సయ్యద్ సోదరుడు పోలీసులకు ఈ విషయాన్ని ఫిర్యాదు చేశాడు. అయితే అప్పటివరకు సయ్యద్ మరణించిన విషయం స్థానికులకు కూడ తెలియదు. దాదాపు నెలరోజులుగా ఆ ఇంటి నుండి సయ్యద్ కొడుకు మాత్రమే బయటకు వెళ్ళి వస్తున్న విషయాన్ని గుర్తించినట్టు స్థానికులు చెప్పారు.
అయితే సయ్యద్ మరణించినా కుటుంబసభ్యులు ఎందుకు ఆయనకు అంత్యక్రియలు నిర్వహించలేదనే విషయమై అర్ధం కావడం లేదని స్థానికులు అంటున్నారు. మృతదేహన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం మంజేరీ మెడకిల్ కాలేజీకి తరలించారు.












Click it and Unblock the Notifications