వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంగారకుడు (మార్స్) వెళ్లేందుకు అడుగు దూరంలో కేరళ అమ్మాయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

పలక్కాడ్: కేరళ రాష్ట్రంలోని పలక్కాడ్‌కు చెందిన ఓ విద్యార్థిని మార్స్ వెళ్లేందుకు మరో అడుగు దూరంలో ఉన్నారు. కేరళకు చెందిన శ్రద్ధా ప్రసాద్ మార్స్ వెళ్లాలని కోరుకుంటున్నారు. ఆమె వయస్సు 19 ఏళ్లు. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే మార్స్ యాత్ర కోసం ఫైనల్ రౌండ్ కోసం క్వాలిఫై అయ్యారు. నాలుగో రౌండ్ వెళ్లేందుకు అవసరమైన మూడో రౌండ్‌లో క్వాలిఫై అయ్యారు.

శ్రద్ధా ప్రసాద్ తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. భారత్ నుండి మార్స్ వన్‌కు జరిగిన నాలుగు రౌండ్లలో ఎంపికైన విద్యార్థిని ఈమె. ఈ విషయాన్ని సోమవారం ఆర్గనైజర్స్ ప్రకటించారు. మరో ఇద్దరు భారతీయులు కూడా సెలక్ట్ అయ్యారు. అయితే వారిలో ఒకరు అమెరికాలో, మరొకరు దుబాయ్‌లో ఉంటున్నారు.

Kerala girl a step away from ticket to Mars

ఓ ఆంగ్ల పత్రికతో శ్రద్ధా ప్రసాద్ మాట్లాడుతూ... నేను మార్స్ మీద స్థిరపడాలనే ఆశతో ఉన్నానని చెప్పారు. తనకు స్పేస్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ అంటే చాలా ఇష్టమని చెప్పారు. రిస్క్ తీసుకోవడం, అడ్వెంచర్స్ చేయడం తనకు ఇష్టమని చెప్పారు.

కాగా, తాను మార్స్‌కు వెళ్లనున్న 24 మెంబర్స్ క్రూలో తాను ఉంటానని ఆకాంక్షించారు. తాను మూడో రౌండ్‌లో క్వాలిఫై అయ్యానని, దీంతో తన విశ్వాసం మరింత పెరిగిందని చెప్పారు. తాను పాస్ అయ్యానని ఫిబ్రవరి 13న తెలిసిందని చెప్పారు. ఇది తనకు పారవశ్యం కలిగించిందన్నారు.

Kerala girl a step away from ticket to Mars

తన కుటుంబాన్ని, స్నేహితులను వదిలి వెళ్లడం కష్టమైన విషయమని తనకు తెలుసునని చెప్పారు. ఇది అంత సులభమైన విషయం కాదని చెప్పారు. అయితే, ఇది తనకు వచ్చే అరుదైన విషయమన్నారు. లైఫ్ టైమ్‌లో ఇది ఒక్కసారే వస్తుందన్నారు.

మార్స్ పైన పర్మనెంట్‌గా సెటిల్ అయ్యే అవకాశాలపై మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులకు తన గురించి తెలుసునని చెప్పారు. కాగా, 2,02,586 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో థర్డ్ రౌండులో వంద మంది పాస్ అయ్యారు. ఇందులో 24 మందిని మార్స్-వన్ ఫర్ ది మిషన్ కోసం తీసుకుంటారు. కాగా, శ్రద్ధా ప్రసాద్‌తో పాటు ఎంపికకు దగ్గరగా ఉన్న వారిలో జీత్ సింగ్, రితికా సింగ్‌ అనే ప్రవాస భారతీయులు ఉన్నారు. జీత్ సింగ్ సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తుండగా, రితీకా సింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో స్థిరపడ్డారు.

English summary
Kerala girl a step away from ticket to Mars
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X