• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అసలు దొంగలు దుబాయ్ అధికారులే.. బాంబు పేల్చిన స్వప్న సురేశ్.. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో సంచలనం..

|

ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో సంచలన పరిణామాం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న స్వప్న సురేశ్ ఎట్టకేలకు నోరు విప్పారు. డిప్లొమాటిక్ బ్యాగేజీలో భారీ ఎత్తున బంగారాన్ని అక్రమంగా తరలించిన వ్యవహారంలో అసలు దొంగలు యూఏఈ రాయబార కార్యాలయం అధికారులేనని, ఇందులో తన పాత్ర చాలా పరిమితమంటూ బాంబు పేల్చారు. దీంతో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి వెళ్లిన ఈ కేసు అనూహ్య మలుపు తిరిగినట్లయింది.

ఇదీ స్వప్న సురేశ్ సంచలనాల జాబితా.. కస్టమ్స్, సీబీఐ, ఎన్ఐఏ వేట.. 10th పాస్ కాకుండానే టాప్‌కు..

బెయిల్ పిటిషన్..

బెయిల్ పిటిషన్..

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్న సురేశ్(36) కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం తిరువనంతపురం ఎయిర్ పోర్టులో డిప్లొమాటిక్ బ్యాగేజీలో 30 కేజీల బంగారం పట్టుపడినప్పటి నుంచి పరారీలో ఉన్న ఆమె.. తన లాయర్ల ద్వారా కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వేసిన పిటిషన్ లో గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారానికి సంబంధించి పలు సంచలన విషయాలను ఆమె పేర్కొన్నారు.

దుబాయ్ అధికారులు చెబితేనే..

దుబాయ్ అధికారులు చెబితేనే..

2016 నుంచి 2019 వరకు తాను యూఏఈ కాన్సులేట్(తిరువనంతపురం)లో పని చేసిన మాట వాస్తవమని, అయితే ఉద్యోగం మానేసిన తర్వాత కూడా దుబాయ్ అధికారులు తనను పనుల కోసం వాడుకుంటున్నారని, ప్రధానంగా యూఏఈ కాన్సులేట్ జనరల్ అసిస్టెంట్ కమిషనర్ రషీద్ ఖాసిం అలి తరచూ ఫోన్లు చేసి పనులు పురమాయించేవాడని, కొవిడ్-19 అవేర్‌నెస్ కార్యక్రమంలోనూ తనను ఇన్వాల్వ్ చేశారని స్వప్న సురేశ్ తన బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు. డిప్లొమాటిక్ బ్యాగేజీ విషయంలోనూ అధికారి రషీద్ చెబితేనే తాను కస్టమ్స్ కు ఫోన్ చేశానని, ఉద్దేశపూర్వక నేరానికి పాల్పడలేదని ఆమె తెలిపారు. ఆ పార్సిల్ రవాణాకు సంబంధించి ముందు నుంచీ ఏం జరిగిందో పూసగుచ్చినట్లు పిటిషన్ లో వివరించారామె.

చావు తప్పును సరిదిద్దుకున్న కిమ్ జాంగ్.. మరణంలేని నియంతకు నివాళి.. కుందేళ్లతో కుస్తీ..

ఒక ఫోన్.. మరో మెయిల్ అంతే..

ఒక ఫోన్.. మరో మెయిల్ అంతే..

‘‘జూన్ చివరి వారంలో ఈ డ్రామా మొదలైంది. జూన్ 30న దుబాయ్ నుంచి త్రివేండ్రం చేరుకున్న కార్గోలో డిప్లొమాటిక్ బ్యాగేజీల గురించి కనుక్కోమంటూ యూఏఈ కాన్సులేట్ అధికారి రషీద్ నన్ను ఆదేశించారు. ఆ మేరకు జులై 1న కస్టమ్స్ అధికారులకు నేను ఫోన్ చేశాను. దానికి రిప్లైగా.. ‘కార్గో కాంప్లెక్స్ లో ఉన్న బ్యాగులను మీరే వచ్చి తీసుకెళ్లొచ్చు''అని జులై 3న కస్టమ్స్ వాళ్లు మెయిల్ పంపారు. కానీ ఆ వెంటనే సదరు పార్సిల్స్ ను వెనక్కి పంపేయాలని రషీద్ భావించారు. బ్యాగులను తిరిగి ఎక్కడికి పంపాలనే వివరాలను కూడా నా ద్వారానే మెయిల్ పెట్టించారు. చివరికి జులై 5న యూఏఈ కాన్సులేట్ కే చెందిన సరిత్ అనే ఉద్యోగి బ్యాగులు తెచ్చేందుకు వెళ్లి దొరికిపోయాడు. ఇందులో మా పాత్ర నామమాత్రమే..''అని స్వప్న సరేశ్ బెయిల్ పిటిషన్ లో వివరించారు.

మీడియా ట్రయల్స్..

మీడియా ట్రయల్స్..

కాగా, గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సూత్రధారి అంటూ తన పేరును, ఫొటోలను విపరీతంగా ప్రచారంలోకి తెచ్చిన మీడియాపై స్వప్న సురేశ్ మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా మీడియానే ట్రయల్స్ నిర్వహిస్తున్నదని, తద్వారా తన పరువుకు భంగం వాటిల్లడంతోపాటు అసలు దొంగలు దర్జాగా తప్పించుకునే అవకాశం ఏర్పడుతుందని స్వప్న తన పిటిషన్ లో పేర్కొన్నారు. 2009నాటి సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం మీడియాలో తన పేరును, ఫొటోను వాడకుండా ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. కాగా, స్వప్న వాదనే కరెక్టయితే, రాయబార కార్యాలయం అధికారులు.. మాజీ ఉద్యోగులను వాడుకోవడం కచ్చితంగా తప్పే అవుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

కస్టమ్స్ కళ్లుగప్పి..

కస్టమ్స్ కళ్లుగప్పి..

గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడిన నాటి నుంచి పరారీలో ఉన్న స్వప్న సురేశ్.. కస్టమ్స్ కళ్లుగప్పి హైకోర్టులో పిటిషన్ దాఖ చేయడం గమనార్హం. ఆమెపై కస్టమ్స్ యాక్ట్ లోని సెక్షన్ 104, సెక్షన్ 135 కింద కేసులు నమోదయ్యాయి. విదేశీ వ్యవహారాలు, దేశభద్రతతో ముడిపడిన అంశం కావడంతో కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేను కస్టమ్స్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దర్యాప్తులో సీబీఐ, ఎన్ఐఏ, రా సాయం కూడా తీసుకుంటామని అధికారులు తెలిపారు.

మోదీ వద్దకు స్వప్న వ్యవహారం..

మోదీ వద్దకు స్వప్న వ్యవహారం..

డిప్లొమాటిక్ బ్యాగేజీలో బంగారం అక్రమరవాణా అనేది దేశ ఆర్థిక రంగానికి, విదేశాల్లో భారత్ ప్రతిష్టకు భంగకరమని, ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాల్సిందిగా కేరళ సీఎం పినరయి విజయన్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. యూఏఈ కాన్సులేట్ లో ఉద్యోగం మానేసిన తర్వాత స్వప్న.. ఓ ఏజెన్సీ ద్వారా కేరళ ప్రభుత్వ ఐటీ శాఖ ప్రాజెక్టులో మేనేజర్ గా చేరారు. ఐటీ శాఖను సీఎం పినరయి విజయనే నిర్వహిస్తుండటంతో ఆయనకు తెలిసే స్మగ్లింగ్ జరిగిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. క్వాలిఫికేషన్, బ్యాగ్రౌండ్ చెక్ చేయకుండా స్వప్నను ఐటీ శాఖలో తీసుకున్న కారణంగా ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ పై బదిలీ వేటుపడింది. స్వప్న వెనుక బడాబాబులు ఉండొచ్చనే అనుమానాల నేపథ్యంలో ఈ కేసుల రాజకీయంగానూ ప్రకంపనలు పుట్టిస్తోంది.

English summary
Swapna Suresh, who has been absconding ever since her name cropped up in the Kerala gold smuggling case filed an anticipatory bail petition. her bail plea seems to accuse the UAE Consulate officer for involving her in the retrieval of the consular baggage that had 30 kg gold, worth Rs 15crores
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more