వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రాష్ట్రంలో మాస్కులు తప్పనిసరి చేసిన ప్రభుత్వం

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని బహిరంగ ప్రదేశాల్లో మాస్కులను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగే ప్రమాదం ఉన్నందన మార్గదర్శకాలు జారీ చేశారు.

అన్ని బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, సమావేశాలలో ప్రజలకు మాస్క్‌లు తప్పనిసరి చేశారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరాన్ని పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో ప్రజలను ఆదేశించింది.

 Kerala government makes masks mandatory in public places

అంతేగాక, ప్రజల కోసం శానిటైజర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దుకాణాలు, థియేటర్లు, వివిధ కార్యక్రమాల నిర్వాహకులను కూడా ఆదేశించింది.

కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో జారీ చేయబడిన ఈ ఉత్తర్వు రాబోయే 30 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అమలులో ఉంటుంది. కాగా, సోమవారం భారతదేశం 114 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే యాక్టివ్ కేసులు 2,119 కి తగ్గాయి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగింది.

మరోవైపు, ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం డేటా ప్రకారం.. యూఎస్‌లో కేసుల పెరుగుదలకు కారణమైన XBB.1.5 వేరియంట్ కేసుల సంఖ్య భారతదేశంలో 26కి పెరిగింది. XBB.1.5 వేరియంట్ కేసులు ఇప్పటి వరకు ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌తో సహా 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో వెలుగుచూశాయి.

English summary
Kerala government makes masks mandatory in public places.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X