తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sabarimala: తిరుమలలో లడ్డూ, శబరిమలలో ఈ ప్రసాదం ఎంతో ఫేమస్, నిలిపేయాలని హైకోర్టు ఆర్డర్ !

|
Google Oneindia TeluguNews

శబరిమల/తిరువనంతపురం: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కేరళలోని శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి అవకాశం లేకపోవడంతో కోట్లాది మంది అయ్యప్ప భక్తులు విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తూ రెండు సంవత్సరాలు తక్కువ మంది భక్తులు శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి కేరళ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు దేవాలయం ఆవరణంలో అయ్యప్పస్వామి ఆలయ ట్రస్ట్ విక్రయించే అరవణ ప్రసాదం (అరవణ పాయసం) కొనుక్కుని ఇంటికి తీసుకు వచ్చి ప్రత్యేక పూజలు చేసి బంధువుల, స్నేహితులకు పంచిపెడుతుంటారు. అలాంటి ఎంతో పవిత్రమైన అరవణ ప్రసాదం విక్రయించకూడదని, వెంటనే నిలిపివేయాలని కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తిరుమలలో లడ్డూ ఎంత ఫేమస్ అనే విషయం కొత్తగా చెప్పనవసరం లేదు, శబరిమలలో అరవణ ప్రసాదం కూడా అంతే ఫేమస్.

too much: మీరు ఫోన్ చేస్తున్న వ్యక్తి మరోక కాల్ లో మాట్లాడుతున్నారు, భార్య టూమచ్ గా బాయ్ ఫ్రెండ్ తో ?too much: మీరు ఫోన్ చేస్తున్న వ్యక్తి మరోక కాల్ లో మాట్లాడుతున్నారు, భార్య టూమచ్ గా బాయ్ ఫ్రెండ్ తో ?

పవిత్రమైన శబరిమల అరవణ ప్రసాదం

పవిత్రమైన శబరిమల అరవణ ప్రసాదం

కేరళ హైకోర్టు తీర్పులో అయ్యప్పస్వామి భక్తులు ఆందోళన చెందుతున్నారు. శబరిమలలో అరవణ పాయసం పంపిణీని కేరళ హైకోర్టు నిలిపివేసింది. అరవణ ప్రసాదంలో వినియోగించే ఏలకుల్లో (ఏలుకలు, లవంగాలు అంటాము) అనుమతించిన స్థాయి కంటే ఎక్కువ మోతాదులో పురుగుమందులు ఉన్నట్లు తేలిందని కేరళ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ కేరళ హైకోర్టు నివేదిక ఇచ్చిందని, అందుకే కేరళ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసిందని మళయాలం మనోరమ మీడియా కథనం తెలిపింది.

కేరళ హైకోర్టు ఆదేశాలు

కేరళ హైకోర్టు ఆదేశాలు

ఫుడ్ సేఫ్టీ అధికారులు నివేదిక ప్రకారం వెంటనే శబరిమలలో అరవణ ప్రసాదం పంపిణి నిలిపివేయాలని కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే అరవణ ప్రసాదం నమూనాలను కూడా పరీక్షించాలని కేరళ హైకోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అరవణ ప్రసాదం ఏలుకలు లేకుండా చెయ్యడానికి అవకాశం లేదా అని ప్రశ్నించిన కేరళ హైకోర్టు సంబంధిత అధికారులతో సంప్రధించిన సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించిందని మళయాలం మనోరమ తెలిపింది.

అయ్యప్ప భక్తుల ప్రయోజనాలు

అయ్యప్ప భక్తుల ప్రయోజనాలు

శబరిమల అయ్యప్పస్వామి భక్తుల ప్రయోజనాలను పరిశీలించామని, తినకూడని తమలపాకులను అరవణ ప్రసాదంలో ఉపయోగించడం చాలా చిన్న విషయం కాదని కూడా కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. శబరిమలలో అరవణ ప్రసాదంలో ఉపయోగించే ఏలకులు తినకూడదని ఫుడ్ సేఫ్టీ అథారిటీ హైకోర్టుకు నివేదిక సమర్పించింది.

భక్తులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి

భక్తులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కేరళ హైకోర్టులో సమర్పించిన నివేదిక ప్రకారం, ఆహార భద్రతా చట్టం ప్రకారం ఏలకులు సురక్షితం కాదని, చాలా క్రిమిసంహారక మందులు వాడటం వలన ఆ ప్రసాదం తింటున్న భక్తులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు కేరళ హైకోర్టుకు నివేదిక సమర్పించారని తెలిసింది.

ప్రైవేట్ పిటిషన్ వేసిన ఆ వ్యక్తి ఎవరు ?

ప్రైవేట్ పిటిషన్ వేసిన ఆ వ్యక్తి ఎవరు ?

కొచ్చిలోని ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల ఫలితాలు నివేదిక కేరళ హైకోర్టుకు సమర్పించారు. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు అరవణ ప్రసాదంకు ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించారు. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన తనిఖీల్లో అరవణ ప్రసాదంలో నాసిరకం ఏలకులు వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ నివేదిక ఇచ్చారు. అరవణ ప్రసాదంలో నాసిరకం ఏలుకలు ఉన్నాయని, రసాయనాలు ఉపయోగించిన ఏకలు ప్రసాదం చెయ్యడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు విచారణ చేసింది. శబరిమల ప్రసాదంపై ప్రైవేట్ పిటిషన్ వేసిన వ్యక్తి ఎవరు అంటూ ఇప్పుడు అయ్యప్ప భక్తులు జోరుగా చర్చించుకుంటున్నారు.

English summary
Kerala High Court issued orders to stop the distribution of Aravana Prasad in Sabarimala, what actually happened?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X